గతకొంత కాలంగా ఏపీ బిజెపి నేతలు టిడిపిపై విమర్శలు గుప్పిస్తున్నారు…అంతేకాదు మిత్ర పక్షం అయిన టిడిపి అధినేతపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేస్తూనే ఉన్నారు..అయితే టిడిపి నేతలని మాత్రం చంద్రబాబు కామెంట్స్ చేయకండి అని అడ్డు చెప్పిన సందర్బాలు అనేకం ఉన్నాయి..అయితే టిడిపి తో పొత్తు కారణంగా అనుకోకుండా లక్కు కలిసొచ్చి దేవాదాయ శాఖామంత్రి గా ఎన్నికైనా మాణిక్యాలరావు..గత కొంతకాలంగా చంద్రబాబు పై విమర్శలు చేస్తూనే ఉన్నారు..ఎప్పుడు వారి వారి మాటలని సీరియస్ గా తీసుకొని చంద్రబాబు మాత్రం.తాజాగా జరిగిన పరిణామాల విషయంలో ఎంతో ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు. పైడికొండల మాణిక్యాలరావు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఎంతో ఆగ్రహం తెప్పించాయి చంద్రబాబుకి ఓ మంత్రిగా ఉంటూ వెంట్రుక బోడి గుండు అంటూ చాలా చీప్ గా చేసిన వ్యాఖ్యలని తెలుగుదేశం పార్టీ మాత్రమే కాదు..ఏపీ ప్రజలు సైతం పెదవి విరుస్తున్నారు..అసలు ఆయన మంత్రేనా అంటూ ఫైర్ అవుతున్నారు..అయితే చంద్రబాబు మాత్రం సదరు మంత్రిగారిని మంత్రి వర్గం నుంచి డిస్మిస్ చేయాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆయన తన పరిధికి మించి విమర్శలు చేస్తున్నారని..ఆయన భాష సరిగా లేదని..ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి…అలాంటి నేతలని భరించే ఓపిక తెలుగుదేశం పార్టీకి లేదని…ప్రతీ సారి ఊరుకుంటున్నాం కదా అని ఆయన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడం మంచిది కాదని ఇతర మంత్రులు, టిడిపి వర్గాల్లో వ్యక్తం అవుతోంది.అయితే కర్ర విరగకుండా పాము చావకుండా మంత్రి మాణిక్యాలరావును తప్పించి..ఆ పార్టీ నేతలు సూచించిన మరొకరికి మంత్రి పదవి ఇవ్వాలని సిఎం తీవ్రంగా ఆలోచిస్తున్నారట…అంతేకాదు మాణిక్యాలరావును తప్పించి ఆస్థానంలో విష్ణుకుమార్ రాజుకు మంత్రి పదవి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది..హద్దులు మీరి మాట్లాడితే ఎవరైనా ఒక్కటేనని మాణిక్యాలరావును తప్పించడం ఖాయం అని అంటున్నారు..