ఏపీ సీఎం చంద్రబాబు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మండిపడ్డారు. ఏపీ కి ప్రత్యేకహోదా ఇవ్వడం కుదరదన్న బీజేపీని పల్లెత్తు మాట అనకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై పోరాటం చేస్తున్న టీడీపీ విమర్శ చేయడం ఏంటని అన్నారు. గత నాలుగేళ్లు తనతో కలిసున్న పవన్ మమ్మల్ని ఆడిపోసుకోవడానికే సభపెట్టారని అన్నారు. రాష్ట్రం ఇంతగా అట్టుడుకుతుంటే ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికుంతే కేంద్రాన్ని పవన్ ఒక్కమాట కూడా అనకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని ఆరోపించారు.
ఏపీ శాసనమండలిలో ఆవేశంగా మాట్లాడిన చంద్రబాబు పవన్ ఆరోపించిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో అవినీతి చాలా ఎక్కువగా ఉందని ఓ సంస్థ చేసిన అధ్యయనంలో వెల్లడైందని పవన్ సూచించారు. మీకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి..? హఎరిటేజ్ మిల్క్ ఫ్యాక్టరీల నుంచి రావడం లేదు కదా . మీ ఆస్తుల నుంచి తియ్యడంలేదు కదా అలాంటప్పుడు రాబోయే ఎన్నికలు ఒక్కో నియోజకవర్గానికి రూ. 25కోట్లు సిద్ధం చేశామంటూ బాహాటంగా సిగ్గులేకుండా మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నారని అన్నారు.
అయితే పవన్ చేసిన ఈ కామెంట్స్ పై తనదైన శైలిలో స్పందించిన చంద్రబాబు ..ఎన్నికలకోసం ప్రతీ నియోజకవర్గానికి రూ.25కోట్లు సిద్ధం చేశామని పవన్ ఆరోపించారుగా ..అసలు పెద్దనోట్లు రద్దు చేయమని చెప్పిందేనేనే. అవినీతి రహిత ఎన్నికలే మా లక్ష్యమని పునరుద్ఘాటించారు. మంచి పనులు చేస్తే ఓట్లకు డబ్బులు ఎందుకు ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు. ఎథిక్స్ కమిటీని ఏర్పాటు చేసింది తానేనని చంద్రబాబు చెప్పారు.
చంద్రబాబు 29సార్లు ఢిల్లీ వెళ్లాను అయినా పీఎం మోడీ తమను పట్టించుకోవడంలేదని అంటున్నారే ..ముందు మన బంగారం మంచిదై ఉండాలికదా..! శేఖర్ రెడ్డి కేసులో మీ అబ్బాయి పేరు ఉన్నందునే ప్రధాని మిమ్మల్ని పట్టించుకోవడంలేదని బెదిరిస్తున్నారంటున్నారే అని అన్న వన్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు..పీఎం అపాయింట్మెంట్ ఇవ్వకపోవడానికి గల కారణాలపై పవన్ కల్యాణ్ అసత్య ఆరోపణలు చేశారన్నారు. తాను రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్లాను తప్ప సొంత ప్రయోజనాల కోసం కాదన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా మెగాఫుడ్ ఫ్యాక్టరీ వల్ల ఉద్యోగాలు వస్తాయి. మెగా ఆక్వాఫుడ్ పార్క్ యజమానులు తన బంధువులా? అని ప్రశ్నించారు.పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడమే నాలక్ష్యం .. పోలవరం కాంట్రాక్టును తనకు కావాల్సిన వారికి ఇప్పించుకున్నానని పవన్ ఆరోపించారని, రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరాలంటే పోలవరం పూర్తి చేయాలని, అందుకు అడ్డంకులు కల్పించవద్దని కోరారు.