ఢిల్లీ వేదికగా చంద్రబాబే స్వయంగా హోదా పోరు మొదలుపెట్టనున్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేడమే లక్ష్యంగా హస్తిన బాటపడుతున్నారు. ఈ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు రేపు, ఎల్లుండి ఆయా పార్టీల నేతలను కలవనున్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో వివిధ పార్టీల సభాపక్ష నేతలను కలిసి ఆంధ్రప్రదేశ్‌కి జరిగిన అన్యాయాన్ని వివరించనున్నారు.
పార్లమెంట్‌లో ఇచ్చిన హామీలకు విలువ లేదా?, కేంద్రానికి బాధ్యత లేదా...అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ పార్టీ ఏపీకి అన్యాయం చేస్తే బీజేపీ నమ్మించి మోసం చేసిందన్నారు చంద్రబాబు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ లేదన్న చంద్రబాబు కేంద్రం దిగొచ్చేవరకూ పోరాటం కొనసాగిస్తామన్నారు. సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకుంటామన్నారు.