కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు వైసీపీ - టీడీపీ పోటాపోటీగా తన వ్యూహాలకు పదనుపెడుతున్నాయి. సోమవారం పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం పై చర్చకు రానున్న నేపథ్యంలో తమ బలాబలాన్ని నిరూపించుకునేందుకు బీజేపీ ని వ్యతిరేకించే పార్టీల మద్దతు కూడగట్టుకునే పనిలో పడ్డాయి.
ఇప్పటికే తాము బీజేపీ వ్యతిరేక పార్టీల నుంచి మద్దతు పెరుగుతుందని సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సీఎం చంద్రబాబుకు అవిశ్వాసానికి మద్దతు పలుకుతున్నట్లు తమిళనాడుకు అన్నాడీఎంకే మాజీ ఎంపీ కేసీ. పళని స్వామి ప్రకటన చేశారు. కావేరీ నిర్వహాణ మండలి ఏర్పాటు చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలుకున్నట్లు కేసీ. పళని స్వామి ప్రకటించారు.
ఆ ప్రకటన పై గుర్రుగా ఉన్న అన్నాడీఎంకే సీఎం ఎడప్పాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంలు సీఎం చంద్రబాబుకు షాకిచ్చారు. టీడీపీకి మద్దతు పలికిన కేసీ.పళనిస్వామిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
మరోవైపు పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని తప్పుబట్టిన కేసీ. పళనిస్వామి లు ఎడప్పాడి- పన్నీర్ సెల్వంల బండారాన్ని బయటపెడతామని హెచ్చరించారు. వారిద్దరికంటే తాను సీనియర్ నాయకుణ్ని అన్న విషయాన్ని మరిచి పోయారా అంటూ ప్రశ్నించారు. అంతేకాదు అన్నాడీఎంకే పార్టీలో చీలకవస్తోందని చెప్పిన కేసీ. పళనిస్వామి కలకలంరేపారు.
పళనిస్వామి అన్నాడీఎంకే పార్టీలో ఉన్నారు. అన్నాడీఎంకే పార్టీలో ఆయన సీనియర్ నాయకుడు. జయలలిత మరణించిన తరువాత అన్నాడీఎంకే పార్టీ రెండుగా చీలిపోయిన సమయంలో కేసీ పళనిస్వామి పన్నీర్ సెల్వం వర్గంలో కీలకనేతగా ఉన్నారు.