Gold Rate: మళ్ళీ పెరిగిన బంగారం ధరలు.. వెండి ధరలు భారీ పతనం!
Gold Rate: ఈరోజు బంగారం ధరలు కొద్దిగా తగ్గాయి. మరోవైపు వెండి ధరలు మాత్రం భారీ పెరుగుదల నమోదు చేశాయి. ఈరోజు దేశంలో వివిధ ప్రాంతాలలో బంగారం, వెండి ప్రారంభధరలు ఇలా ఉన్నాయి
నిన్న కాస్త పైకెగసిన బంగారం ధరలు ఈరోజు కూడా పైచూపులే చూశాయి. బంగారం ధరలు శుక్రవారం ప్రారంభ ధరలతో పోలిస్తే కొద్దిపాటి పెరుగుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (07.11.2020) కొద్దిగా పైకే కదిలాయి. మరో వైపు వెండి ధరలు మాత్రం అమాంతం కిందికి దిగొచ్చాయి.
హైదరాబాద్ లో బంగారం ధరలు..
హైదరాబాద్ లో బంగారం ధరలు పెరుగుతూనే వస్తున్నాయి . బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. శనివారం (07.11.2020) బంగారం ధరలు శుక్రవారం ప్రారంభ ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 390 రూపాయలు పెరిగి 48,800 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 430 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 52,360 రూపాయలుగా నమోదు అయింది.
వెండి ధరలు పైకి..
బంగారం ధరలు కొద్దిగా పెరుగుదల కనబరిస్తే, వెండి ధరలు ఈరోజు భారీగా కిందికి దిగొచ్చాయి. కేజీ వెండి ధర శుక్రవారం నాటి ప్రారంభ ధరతొ పోలిస్తే 2100 రూపాయలు తగ్గింది. దీంతో 64వేల రూపాయల స్థాయిలో వెండి ధరలు పతనం చూసాయి. దీంతో కేజీ వెండి ధర 64,500 రూపాయల వద్దకు చేరుకుంది.
విజయవాడ, విశాఖపట్నంలలో..
ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. బంగారం ధరలు ఈరోజు పెరుగుదల నమోదు చేశాయి. శనివారం (07.11.2020) బంగారం ధరలు శుక్రవారం ప్రారంభ ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 390 రూపాయలు పెరిగి 48,800 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 430 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది. దీంతో 52,360 రూపాయలుగా నమోదు అయింది
దేశరాజధాని ఢిల్లీలో..
మరోవైపు ఢిల్లీలో బంగారం ధరలు పై పైకే కదిలాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శుక్రవారం నాటి ప్రారంభ ధర కంటె 400 రూపాయలు పెరిగింది. దీంతో 50,050 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం శుక్రవారం నాటి ప్రారంభ ధర కంటె 440 రూపాయలు పెరుగుదల కనబరిచింది. దీంతో 54,600 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక ఢిల్లీ లో వెండి ధరల విషయానికి వస్తే, ఇక్కడ వెండి ధరలు ఈరోజు భారీగా పెరిగాయి. కేజీ వెండి ధర శుక్రవారం నాటి ప్రారంభ ధరతొ పోలిస్తే 2000 రూపాయలు పెరిగింది. దీంతో 64వేల రూపాయల స్థాయికి వెండి ధరలు ఎగశాయి. దీంతో కేజీ వెండి ధర 64,500 రూపాయల వద్దకు చేరుకుంది.
ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 07-11-2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.