Saving Scheme: 10 ఏళ్లలో రూ. 17 లక్షలు.. రోజుకు ఎంత ఇన్వెస్ట్‌ చేయాలంటే..!

Saving Scheme: ఒకప్పుడు ఖర్చు చేసిన తర్వాత మిగిలింది పొదుపు చేసే వారు. కానీ ప్రస్తుతం పొదుపు చేసిన తర్వాత మిగిలిన మొత్తాన్ని ఖర్చు చేస్తున్నారు.

Update: 2024-11-06 15:00 GMT

Saving Scheme: 10 ఏళ్లలో రూ. 17 లక్షలు.. రోజుకు ఎంత ఇన్వెస్ట్‌ చేయాలంటే..!

Saving Scheme: ఒకప్పుడు ఖర్చు చేసిన తర్వాత మిగిలింది పొదుపు చేసే వారు. కానీ ప్రస్తుతం పొదుపు చేసిన తర్వాత మిగిలిన మొత్తాన్ని ఖర్చు చేస్తున్నారు. ఆర్థిక క్రమ శిక్షణ ఎంతలా పెరిగిందో చెప్పేందుకు ఇదే నిదర్శనం. బ్యాంకులు సైతం రకరకాల పెట్టుబడి పథకాలతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పోస్టాఫీస్‌ కూడా మంచి మంచి పెట్టుబడి పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాంటి ఒక బెస్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

10 ఏళ్లలో రూ. 17 లక్షలు పొందే ఈ స్కీమ్‌ పేరు రికరింగ్ డిపాటిజ్‌ స్కీమ్‌. ఇందులో ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టవచ్చు. ఎలాంటి రిస్క్‌ లేకుండా గ్యారంటీ రిటర్న్స్‌ పొందొచ్చు. ఈ పథకంలో కనీసం రూ. 100 నుంచి పెట్టుబడి పెట్టొచ్చు. గరిష్టం ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఈ పథకం మెచ్యూరిటీ ఐదేళ్లు మాత్రమే ఉంటుంది. కావాలనుకుంటే మరో ఐదేళ్లు పెంచుకోవచ్చు.

ఇక ఈ అకౌంట్‌ను సింగిల్ అకౌంట్ లేదా జాయింట్‌ అకౌంట్ కింద ముగ్గురు చేరొచ్చు. ఉదాహరణకు మీరు ఈ పథకం ద్వారా ఐదేళ్లలో రూ. 17 లక్షలు రిటర్న్‌ పొందాలనుకుంటే నెలకు రూ. 10 వేలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అంటే రోజుకు రూ. 330 వరకు పొదుపు చేయాల్సి ఉంటుందన్నమాట. అయితే మీరు ఇలా పదేళ్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

నెలకు రూ. 10 వేల చొప్పున పెట్టుబడి పెట్టుకుంటూ పోతే ఐదేళ్లకు వడ్డీతో కలిపి మొత్తం రూ. 7.13 లక్షలు అవుతుంది. మరో ఐదేళ్లు పొడగిస్తే.. మీ పెట్టుబడి రూ.12 లక్షలు అవుతుంది. దీనిపై వచ్చే వడ్డీ రూ. 5 లక్షల 8వేల 546 అవుతుంది. అంటే 10 ఏళ్ల తర్వాత మీకు అసలు, వడ్డీతో కలిపి 17లక్షల 8వేల 546 రూపాయలు పొందొచ్చు.

తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో మంచి రిటర్స్‌ పొందడం ఈ స్కీమ్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు. పోస్టాఫీసు ఆర్డీ పథకానికి 6.7 శాతం వార్షిక వడ్డీ లభిస్తోంది.

Tags:    

Similar News