Rewind 2024: ఈ ఏడాది స్టాక్‌ మార్కెట్‌ను షేక్‌ చేసిన అంశాలివే..!

Rewind 2024: మరో ఏడాది ముగింపు దశకు చేరుకుంటోంది. కాల గర్భంలో 2024 ముగియడానికి ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి.

Update: 2024-12-21 10:40 GMT

Rewind 2024: ఈ ఏడాది స్టాక్‌ మార్కెట్‌ను షేక్‌ చేసిన అంశాలివే..!

Rewind 2024: మరో ఏడాది ముగింపు దశకు చేరుకుంటోంది. కాల గర్భంలో 2024 ముగియడానికి ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. ఈ ఏడాది ఎన్నో కీలక పరిణామాలకు సాక్ష్యంగా నిలిచింది. మరి స్టాక్‌ మార్కెట్లో 2024లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది స్టాట్ మార్కెట్‌ను షేక్‌ చేసిన కొన్ని కీలక సంఘటనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

* ఈ ఏడాది విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల్లో మార్పులు కనిపించాయి. పెరుగుతున్న అమెరికా వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం కారణంగా గ్లోబల్ లిక్విడిటీ వాతావరణం మరింత కఠినంగా మారింది. దీంతో 2024 జూన్‌ నాటికి భారతదేశం 4.5 బిలియన్‌ డాలర్ల నికర ఎఫ్‌ఐఐ అవుట్ ఫ్లోను చూసింది. అయితే ఆ తర్వాత గ్లోబల్ లిక్విడిటీ పరిస్థితులు మెరుగుపడటం ప్రారంభించాయి.

* ఈ ఏడాది మార్కెట్‌ను ప్రభావితం చేసిన మరో ప్రధాన అంశం అమెరికా ఫెడరల్ బ్యాంక్‌ తీసుకున్న నిర్ణయాలు. 2024 నవంబర్‌ సమావేశంలో అమెరికాలో ద్రవ్యోల్బణం కట్టడి కోసం ఫెడ్ వడ్డీ రేట్లను 0.25% తగ్గించింది. దీంతో వినియోగదారుల వడ్డీ రేట్లపై ప్రభావం పడింది. వడ్డీ రేట్లను 4.50% నుంచి 4.75% వరకు తగ్గించడంతో ప్రపంచ లిక్విడిటీపై పరిమితులను సృష్టించింది. ఇది అభివృద్ధి చెందుతోన్న దేశాల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపింది.

* ఈ ఏడాది భారత స్టాక్‌ మార్కెట్లపై ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రభావం చూపాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్యం, దక్షిణ చైనా సముద్రంలో ప్రపంచ చమురు ధరలపై గణనీయమైన ప్రభావం చూపాయి. దీంతో ముడి చమురు ధరలు 2024 మధ్య నాటికి బ్యారెల్‌కు 100 డాలర్లకు చేరుకున్నాయి.

* ద్రవ్యోల్బణం భారత ఆర్థిక వ్యవస్థ, స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ క్రమంలో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధాన కమిటీ (MPC) డిసెంబర్ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంది. రెపోటు కారణంగా వినియోగదారుల వ్యయం తగ్గడం, క్రెడిట్ వృద్ధి, పెరిగిన రుణ ఖర్చులపై ప్రభావం చూపుతుందని భావించింది. ఇది క్రమంగా వినియోగం, పెట్టుబడిని తగ్గించి, కీలక రంగాలలో మందగమనానికి దారి తీసింది.

* ఈ ఏడాది స్టాక్ మార్కెట్‌పై ప్రభావాన్ని చూపిన మరో అంశం ఎన్నికలు. ఏప్రిల్‌-మే నెలల్లో జరిగిన రాజకీయ అనిశ్చితి కారణంగా మార్కెట్ అస్థిరంగా కొనసాగింది. నిఫ్టీ 50 ఇండెక్స్ జనవరి నుంచి ఏప్రిల్ 2024 వరకు 2 నుంచి 3 శాతం క్షీణించింది. అయితే ఆ తర్వాత బీజేపీ విజయం తర్వాత జరిగిన స్టాక్ ర్యాలీలో మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి.

* దేశంలో పునరుత్పాదక ఇంధన రంగం, క్లీన్‌ ఎనర్జీని ప్రోత్సహించే ప్రభుత్వ విధానాల వల్ల అదానీ గ్రీన్ ఎనర్జీ, NTPC రెన్యూవబుల్ ఎనర్జీ, రిన్యూ పవర్ వంటి కంపెనీలు మంచి వృద్ధిని సాధించాయి. ఈ క్రమంలో అదానీ గ్రీన్ షేరు ధర ఏకంగా 40% పెరిగింది.

* ఇక ఈ ఏడాది భారత ఐటీ రంగంలో మిశ్రమ ఫలితాలు కనిపించాయి. క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి సేవలకు డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పటికీ వేతన ద్రవ్యోల్బణం, గ్లోబల్ మాంద్యం కారణంగా మిశ్రమ ఆదాయాల వృద్ధికి దారితీశాయి.

* అధిక ద్రవ్యోల్బణం కారణంగా ఆహారం, ఇంధన ధరలలో ఆదాయాన్ని తగ్గించింది. ఇది కాస్తా వినియోగదారుల వ్యయ విధానాలపై ప్రభావం చూపింది. ఈ క్రమంలో FMCG, రిటైల్ రంగాలు నెమ్మదిగా వృద్ధిని కనబరిచాయి. హిందుస్తాన్ యూనిలీవర్, నెస్లే ఇండియా అంచనాల కంటే తక్కువ ఆదాయ వృద్ధిని నమోదు చేశాయి.

* ఇక ఈ ఏడాది స్టాక్‌ మార్కెట్‌లో జరిగిన మరో కీలక పరిణామం రియలన్స్‌ ఇండస్ట్రీస్ వృద్ధి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ భారతదేశంలో టాప్‌ బిజినెస్‌ గ్రూప్‌గా తన మార్కెట్‌ క్యాప్‌ను రూ. 20 లక్షల కోట్లకు పెంచుకుతంది. ఇది ఈ ఏడాది స్టాక్‌ మార్కెట్‌లో కీలక మార్పుగా చెప్పొచ్చు.

Tags:    

Similar News