Gold Rate Today: వరుసగా మూడో రోజు తగ్గిన బంగారం..వెండి రూ. 89వేల దిగువకు
Gold Rate Today: బంగారం ధర వరుసగా మూడోరోజు దిగి వచ్చింది. శనివారం దేశరాజధాని ఢిల్లీలో తులం బంగారం రూ. 170 తగ్గింది. దీంతో రూ. 78,130లకు చేరింది. శుక్రవారం 99.9శాతం స్వచ్చత గల బంగారం ధర రూ. 78, 300 పలికింది. మరోవైపు శుక్రవారం కిలో వెండి ధర రూ. 1,800 పతనం అయ్యింది. నేడు 88,150 పలుకుతోంది. గురువారం కిలో వెండి ధర రూ. 90వేలు ఉంది.
MCXలో ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో, ఫిబ్రవరి డెలివరీ కోసం బంగారం కాంట్రాక్ట్‌ల ధర శుక్రవారం రూ. 50 లేదా 0.07 శాతం పెరిగి 10 గ్రాములకు రూ.75,701కి చేరుకుంది. దేశీయ MCX మార్కెట్‌లో రూ. 75,500 స్థాయిలు తాత్కాలిక మద్దతుగా పని చేయడంతో Comexలో బంగారంలో $2,600 స్థాయిలకు సమీపంలో మార్జినల్ కొనుగోలు కనిపించింది. ఎల్‌కెపి సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ విపి రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది మాట్లాడుతూ, "ఫెడ్ రేట్లను తక్కువగా ఉంచాలని నిర్ణయించినప్పటికీ, దాని అంచనాలు మరింత రేటు తగ్గింపులను సూచించాయి. ఇది గత రెండు రోజులుగా బంగారం ధరలను ఒత్తిడిలో ఉంచిదని తెలిపారు.
వడ్డీరేట్ల తగ్గింపు విషయమై యూఎస్ ఫెడ్ రిజర్వ్ నిర్ణయం వల్లే బంగారం ధరలు తగ్గాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.