Gold Rate Today: మహిళలకు అదిరిపోయే వార్త..తగ్గిన బంగారం ధర..హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
Gold Price Today: దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకున్న పరిస్థితుల వల్ల బంగారం, వెండి ధరలు మార్పులు వస్తున్నాయి. ఈ క్రమంలో బంగారం ధరలు భారీగా హెచ్చుతగ్గులకు గురువుతున్నాయి. తాజాగా డిసెంబర్ 22 ఆదివారం నాడు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 610 తగ్గి రూ. 70, 390 కి చేరుకుంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 660 తగ్గి 76,790కి చేరింది. వెండి కిలో ధర రూ. 99,000లు ఉంది. హైదరాబాద్ లో 71,000, 24 క్యారెట్లు రూ. 77,450గా ఉంది. విశాఖ, విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్ లో కిలో వెండి రూ. 99వేలు ఉంది. విజయవాడ, విశాఖలోనూ ఇవే ధరలు ఉన్నాయి. స్థానిక ఆభరణాల వ్యాపారుల నుంచి డిమాండ్ మందగించడం వల్లే బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయని వ్యాపారులు చెబుతున్నారు. శనివారం MCXలో ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో, ఫిబ్రవరి డెలివరీ కోసం బంగారం కాంట్రాక్ట్ ధర రూ. 50 లేదా 0.07 శాతం పెరిగి 10 గ్రాములకు రూ.75,701కి చేరుకుంది.
దేశీయ MCX మార్కెట్‌లో రూ. 75,500 స్థాయిలు తాత్కాలిక మద్దతుగా పని చేయడంతో Comexలో బంగారంలో $2,600 స్థాయిలకు సమీపంలో మార్జినల్ కొనుగోలు కనిపించింది. వడ్డీ రేటు చక్రం చుట్టూ ఉన్న అనిశ్చితి కారణంగా మొమెంటం అస్థిరంగా ఉంటుంది.ఫెడ్ రేట్లను తక్కువగా ఉంచాలని నిర్ణయించినప్పటికీ, దాని అంచనాలు భవిష్యత్తులో తక్కువ రేటు తగ్గింపులను సూచిస్తున్నాయి. దీని కారణంగా బంగారం ధరలు పడిపోయాయి.