Gold Rate Today: నేడు బంగారం ధర మరోసారి తగ్గింది. గురువారంతో పోల్చితే శుక్రవారం భారీగా తగ్గింది. నేడు తులంపై రూ. 200 తగ్గింది. డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 76,300 ఉంది. 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 70,700 ఉంది.
దేశ రాజధానిలో బంగారం ధరలు శుక్రవారం తగ్గుముఖం పట్టాయి. US ఫెడ్ 2025లో కేవలం 2 రేటు తగ్గింపుల సూచన బంగారం ధరపై ప్రభావం చూపింది. ఆల్ ఇండియా బులియన్ అసోసియేషన్ ప్రకారం, 99.9 శాతం స్వచ్ఛత కలిగిన విలువైన లోహం 10 గ్రాములకు రూ.800 తగ్గి రూ.78,300కి చేరుకుంది. గురువారం చివరి ట్రేడింగ్ సెషన్‌లో 10 గ్రాములకు రూ.79,100 వద్ద ముగిసింది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర శుక్రవారం 10 గ్రాములకు రూ. 800 తగ్గి రూ.77,900కి చేరుకుంది. గత ముగింపు ధర 10 గ్రాములకు రూ.78,700గా ఉంది. బలహీనమైన అంతర్జాతీయ ధోరణి మధ్య నగల వ్యాపారుల నుండి మందగించిన డిమాండ్ కారణంగా ధరలు తగ్గాయి.
బంగారం స్వచ్ఛతను క్యారట్లల్లో కొలుస్తుంటారు. క్యారట్ల వాల్యూ పెరిగే కొద్దీ పసిడి స్వచ్ఛతతోపాటు ధర కూడా పెరుగుతుంది. మేలిమి బంగారాన్ని 24క్యారెట్లు అని చెబుతారు. అంటే ఇది 99.9స్వచ్చమైన బంగారం. ఇది కాయిన్స్ బార్స్, బిస్కెట్ల రూపంలో మాత్రమే దొరుకుతుంది. నగల తయారీకి 22క్యారెట్ల స్వచ్ఛతతో కూడిన బంగారాన్ని వినియోగిస్తుంటారు. ఇందులో ఇతర లోహాలు కూడా కలుపుతారు. బంగారంతో చేయించుకునే ఆభరణాలన్నీ 22క్యారెట్లు 916 స్వచ్ఛతతో కూడి ఉంటాయి. ఈ ధర కోసం మేలిమి బంగారం ధరను 91.6 శాతంతో గుణిస్తారు.