Gold Rate Today: పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్..తులం ధర ఎంతంటే?

Update: 2024-12-19 00:32 GMT

Gold-Silver Price: పసిడి ధరలు గతకొన్నిరోజులుగా తగ్గుతున్నాయి. దేశవ్యాప్తంగా బంగారం ధరలు నేడు డిసెంబర్ 19వ తేదీ గురువారం స్వల్పంగా తగ్గాయి. వెండి కూడా బంగారం బాటలోనే స్వల్పంగా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర నిలకడగా కొనసాగుతున్న వేళ..దేశీయ మార్కెట్లో బంగారం ధర పతనమైయ్యింది.

దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారంపై రూ. 200 తగ్గింది. దీంతో తులానికి రూ. 79,100 చేరుకుందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. గత 3 రోజులుగా తగ్గుతూ వచ్చిన వెండి బుధవారం రూ. 500 పెరిగి కిలో ధర రూ. 92వేలకు చేరుకుంది. ప్రస్తుతం బంగారం విషయంలో పెట్టుబడిదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లపై నిర్ణయాన్ని ప్రకటించనుంది. అయితే ఈసారి వడ్డీ రేట్లలో కోత విధించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో పెట్టుబడిదారులు గోల్డ్పై ఇన్వెస్ట్ విషయంలో అప్రమత్తంగా ఉన్నారు. ఎంసీఎక్స్ లో బంగారం ధర రూ. 74 పెరిగి 10 గ్రామల ధర రూ. 76,945కి చేరుకుంది.

దేశంలో పలు నగరాల్లో బంగారం ధరలను చూస్తే.. ముంబై లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,350 ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 77,840 ఉంది. చెన్నైలో గోల్డ్ రేట్ 71,350 ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 77,840 పలుకుతోంది. హైదరాబాద్ లో 22క్యారెట్ల బంగారం ధర రూ. 71,350 ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,840 ఉంది.

Tags:    

Similar News