Stock Market: భారీ నష్టాల్లో భారత స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market)సూచీలు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్(Sensex) 900 పాయింట్లు నష్టపోయింది.
దేశీయ స్టాక్ మార్కెట్ (Stock Market)సూచీలు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్(Sensex) 900 పాయింట్లు నష్టపోయింది. నిష్టీ(Nifty)) 24 వేల పాయింట్ల కింద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 948 పాయింట్లు తగ్గి 79, 169 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 307 పాయింట్లు తగ్గి 23, 891 వద్ద కొనసాగుతోంది.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లలో కోత విధించింది. వడ్డీ రేట్లను 25 బేసిక్ పాయింట్లు తగ్గించింది. వడ్డీ రేట్లను 4.50-4.75 శాతం నుంచి 4.25-4.50 శాతానికి పరిమితం చేశారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లలో కోత ప్రభావం ఆసియా-పసిఫిక్ మార్కెట్లపై ప్రభావం చూపింది.ఈ మార్కెట్లు కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి.