EPFO: ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. అధిక వేతనాలపై పెన్షనలకు సంబంధించిన ఎంపికలు, జాయింట్ ఆప్షన్స్ ధ్రువీకరణ కోసం పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను ప్రాసెస్ చేయడంతోపాటు అప్ లోడ్ చేయడానికి యజమానులకు చివరి తేదీ గడువు పెంచింది. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రకారం ఈ పొడిగింపు అవసరమైన దరఖాస్తులను పూర్తి చేసేందుకు యజమానులకు మరికొంత సమయం తీసుకునే వెసులుబాటును కల్పించింది. నవంబర్ 4, 2022నాటి సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా దరఖాస్తులను సమర్పించడానికి ఆన్ లైన్ సౌకర్యం మొదటి ఫిబ్రవరి 26,2023 ప్రారంభించారు. అది మే3, 2023 వరకు పొడిగించారు.
ఇప్పుడు, EPFO మరోసారి గడువును మార్చింది. అధిక వేతనాలపై పెన్షన్ స్కీమ్ కింద ఆప్షన్ లేదా ఉమ్మడి ఎంపికల ధ్రువీకరణ కోసం పెండింగ్‌లో ఉన్న సుమారు 3.1 లక్షల దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి.. అప్‌లోడ్ చేయడానికి యజమానులకు జనవరి 31, 2025 వరకు సమయం ఇచ్చింది. జనవరి 31, 2025తో పాటు, జనవరి 15, 2025 కూడా యజమానులు తప్పనిసరిగా గమనించవలసిన ముఖ్యమైన తేదీ.
EPFO ద్వారా స్వీకరించిన, పరిశీలించిన దరఖాస్తులకు సంబంధించి EPFO అదనపు సమాచారం/స్పష్టత కోరిన 4.66 లక్షల కేసులలో, జనవరి 15, 2025లోపు ప్రత్యుత్తరాలు సమర్పించాలని/సమాచారాన్ని అప్‌డేట్ చేయాలని కూడా యజమానులను అభ్యర్థించారు అని సంస్థ పేర్కొంది.