Gold Price Today: బంగారం, వెండి ధరలు నిత్యం హెచ్చుతగ్గులకు గురవుతుంటాయి. ఒక రోజు పెరిగితే..మరో రోజు తగ్గుతుంది. తాజా బంగారం ధర తులంపై 120 తగ్గింది. దీంతో గత నాలుగు రోజులు పెరుగుతున్న బంగారం ధరకు బ్రేక్ పడినట్లయ్యింది. కాగా నేడు డిసెంబర్ 18వ తేదీ బుధవారం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 71,660 ఉంది. 24క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేట్ రూ. 78,160నమోదు అయ్యింది. కోల్ కతా, ముంబై, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 22క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 71,510గా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 78,010గా ఉంది. వెండి ధర తగ్గింది. హైదరాబాద్, చెన్నై, కేరళలో, కిలో వెండి ధర రూ. 99,900గా ఉంది. ఢిల్లీ, కోల్ కతా, బెంగళూరు, ముబైలో కిలో వెండి ధర రూ. 92,400లు ఉంది.