Credit card: క్రెడిట్‌ కార్డుతో షాపింగ్ చేస్తున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే సంగతులు

Safety tips for using credit cards for online payments : క్రెడిట్ కార్డును ఉపయోగించే సమయంలో కచ్చితంగా కొన్ని సెక్యూరిటీ ఫీచర్లను ఉపయోగించుకోవాలి. క్రెడిట్ కార్డు లిమిట్‌ను సెట్‌ చేసుకోవాలి.

Update: 2024-12-22 15:15 GMT

Safety tips for using credit cards for online payments: మారిన టెక్నాలజీతో పాటు నేరాలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా సైబర్‌ నేరాలు ఓ రేంజ్‌లో పెరుగుతున్నాయి. క్రెడిట్ కార్డు మోసాలు ఇటీవల ఎక్కువుతున్నాయి. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసే సమయంలో క్రెడిట్ కార్డుల వినియోగంలో చేసే తప్పులు భారీ మూల్యాన్ని చెల్లించేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే క్రెడిట్‌ కార్డును ఉపయోగించే సమయంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆన్‌లైన్‌ షాపింగ్ చేసే సమయంలో విశ్వసనీయ సైట్లలోనే కొనుగోలు చేయాలి. సైబర్‌ నేరస్థులు ఫేక్‌ వెబ్‌సైట్స్‌ను రూపొందిస్తూ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. అందుకే షాపింగ్ చేసే ముందు వెబ్‌సైట్‌ యూఆర్‌ఎల్‌ను జాగ్రత్తగా పరిశీలించాలి. యూఆర్‌ఎల్‌లో ఏ మాత్రం సందేహం వచ్చినా అలాంటి సైట్స్‌కు దూరంగా ఉండడమే ఉత్తమం. వీలైనంత వరకు మీరు షాపింగ్ చేసే ఈ కామర్స్‌ సంస్థలకు సంబంధించి అధికారిక యాప్స్‌లోనే షాపింగ్ చేసేందుకు ప్రయారిటీ ఇవ్వాలి.

ఇటీవల బ్యాంకులు వర్చువల్ క్రెడిట్ కార్డులను అందిస్తున్నాయి. ఇవి మీ క్రెడిట్ కార్డ్ ఖాతాకు లింక్ చేసిన తాత్కాలిక కార్డుల్లాగా పనిచేస్తాయి. లావాదేవీ ముగిసిన వెంటనే ఈ కార్డుల వ్యాలిడిటీ ముగుస్తుంది. దీంతో మీ క్రెడిట్‌ కార్డు దుర్వినియోగానికి గురి కాకుండా ఉంటుంది. ఇక మీ క్రెడిట్‌ కార్డుకు సంబంధించి కచ్చితంగా యాప్స్‌ ఉండేలా చూసుకోండి. ఎప్పటికప్పుడు మీ క్రెడిట్ కార్డు వివరాలను చెక్‌ చేస్తూ ఉండాలి. లావాదేవీల్లో ఏవైనా అనుమానాదస్పద లావాదేవీలు కనిపిస్తే వెంటనే అలర్ట్‌ అవ్వాలి. వెంటనే బ్యాంకు అధికారులకు సమాచారం అందిస్తే ఆ లావాదేవీలను హోల్డ్‌ చేస్తారు.

క్రెడిట్ కార్డును ఉపయోగించే సమయంలో కచ్చితంగా కొన్ని సెక్యూరిటీ ఫీచర్లను ఉపయోగించుకోవాలి. క్రెడిట్ కార్డు లిమిట్‌ను సెట్‌ చేసుకోవాలి. దీని ద్వారా ఎక్కువ మొత్తంలో ట్రాన్సాక్షన్స్‌ చేసే సమయంలో కచ్చితంగా పర్మిషన్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే క్రెడిట్‌ కార్డులను ఉపయోగించే సమయంలో టూ స్టెప్ అథంటికేషన్‌ ఫీచర్‌ను ఉపయోగించాలి. ప్రతీ ట్రాన్సాక్షన్‌కు అలర్ట్‌ వచ్చేలా సెట్టింగ్స్‌ చేసుకోవాలి. ఇలాంటి టిప్స్‌ పాటించడం ద్వారా క్రెడిట్ కార్డును సేఫ్‌గా ఉయోగించుకోవచ్చు. 

Tags:    

Similar News