Gold Rate Today: పసిడి ప్రియులకు శుభవార్త..భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
Gold Rate Today: బంగారం, వెండి కొనాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే మీకో గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా పెరిగిన బంగారం, వెండి ధరలకు తాజాగా బ్రేక్ పడింది. క్రిస్మస్ పండగకు ముందే బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గత కొన్నాళ్లుగా పెరిగిన ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఉదయం 6.25గంటల నాటికి 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77, 440కి చేరింది. నిన్నటితో పోల్చితే ఈ ధర రూ. 200 తగ్గింది. మరోవైపు 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 70,990కి చేరింది.
దేశ రాజధాని ఢిల్లీలో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 77,590కి చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 71,140కి చేరుకుంది. ఇక వెండి ధరల గురించి చూసినట్లయితే కిలో వెండి ధర రూ. 91,400గా ఉంది. ఆదివారంతో పోల్చి చూస్తే 1000 రూపాయలు తగ్గింది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో బంగారం, వెండి ధరల గురించి తెలుసుకుందాం.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
ఢిల్లీలో రూ. 77,590, రూ. 71,140
హైదరాబాద్‌లో రూ. 77,440, రూ. 70,990
విజయవాడలో రూ. 77,440, రూ. 70,990
చెన్నైలో రూ. 77,440, రూ. 70,990
ముంబైలో రూ. 77,440, రూ. 70,990
వడోదరలో రూ. 77,490, రూ. 71,040
కేరళలో రూ. 77,440, రూ. 70,990
కోల్‌కతాలో రూ. 77,440, రూ. 70,990
బెంగళూరులో రూ. 77,440, రూ. 70,990
పూణేలో రూ. 77,440, రూ. 70,990