Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే..?
Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈమధ్య భారీగా పెరుగుతున్న బంగారం ధర తాజాగా పసిడి ధరల్లో భారీగా తగ్గుదల కనిపిస్తోంది.
Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈమధ్య భారీగా పెరుగుతున్న బంగారం ధర తాజాగా పసిడి ధరల్లో భారీగా తగ్గుదల కనిపిస్తోంది. నేడు శనివారం బంగారం ధరలు తగ్గాయి. శనివారం హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 80,550వద్ద కొనసాగుతోంది. ఇక 10గ్రాముల 22 క్యారెట్ల పసిడి విషయానికి వస్తే రూ. 73,840వద్ద కొనసాగుతోంది. నిన్న 22 క్యారెట్ల బంగారం రూ. 700 తగ్గగా.. 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారంపై రూ. 770 మేరకు తగ్గింది. ఇక ఈరోజు ఉదయం 6 గంటలకు నమోదైన ధరలు చూస్తే మరో 10 మేరకు తగ్గింది.
విజయవాడలో 10 గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 73,840గా ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ప్రైజ్ రూ. 80,550గా ఉంది. కేజీ వెండి ధర రూ. 1,05,900గా ఉంది. ఇక విశాఖపట్నంలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 10గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73,840గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 80,550గాను ఉంది. 100 గ్రాముల సిల్వర్ రేటు రూ. 1,059 ఉంది.