Gold Rate Today: వరుసగా దిగొస్తున్న బంగారం ధర..నేడు స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేట్..తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇవే
Gold Rate Today: దేశంలో బంగారం ధరలు మరోసారి స్వల్పంగా తగ్గాయి. నేడు డిసెంబర్ 24వ తేదీ మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,440 పలుకుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర ఉంది. అదే సమయంలో వంద గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ. 7,74,400గా ఉంది. గ్రాము బంగారం ధర రూ. 7,744 వద్ద కొనసాగుతోంది.
మరోవైపు 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లు కూడా స్థిరంగా రూ. 70,990 వద్ద ఉంది. సోమవారం కూడా ఇదే ధర ఉంది. ఇక 100 గ్రాముల 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 7,09,900గా ఉంది. గ్రాము బంగారం ధర ప్రస్తుతం 7,099గా ఉంది. ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో బంగారం ధర మంగళవారం స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,140గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 77,590వద్ద కొనసాగుతోంది. కోల్ కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ట బంగారం ధర రూ. 70, 990 వద్ద ఉంది. 24క్యారెట్ల బంగారం ధర 77, 440 వద్ద కొనసాగుతోంది. ముంబై, పుణె, కేరళలోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్ లో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 70.990గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 77,440గా నమోదు అయ్యింది. విజయవాడలోనూ ఈ ధరలు కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు ఉన్నాయి. ఇక అటు దేశంలో వెండి ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 100 గ్రాముల వెండి ధర రూ. 9,130గా ఉంది. కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 91,300వద్ద కొనసాగుతోంది. సోమవారం ఈ ధర రూ. 91,400గా ఉంది.