PM Kisan 19th Installment: రైతులకు అలర్ట్.. ఇలా చేయకపోతే పీఎం కిసాన్ రాదు.. చివరి తేదీ ఎప్పుడంటే..?
PM Kisan 19th Installment: దేశంలో రైతుల ఆర్థిక కష్టాలను తీర్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పేరుతో పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
PM Kisan 19th Installment: దేశంలో రైతుల ఆర్థిక కష్టాలను తీర్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పేరుతో పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 2019లో అమల్లోకి తీసుకొచ్చిన ఈ పథకంతో రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తారు. ప్రతీ ఏటా మూడు వాయిదాల్లో మొత్తం రూ. 6 వేలు అందిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా రైతన్నల ఖాతాల్లోకి 19వ విడుదల డబ్బులు జమ కావాల్సి ఉంది. త్వరలోనే ఈ డబ్బులు వేయనున్నారని తెలుస్తోంది.
19వ విడత పీఎం కిసాన్ నిధులు ఫిబ్రవరి నెలలో రైతుల ఖాతాల్లోకి పడనున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో నిధులు ఖాతాలో జమ కావాలంటే రైతులు కచ్చితంగా ఒక పని చేయాలని అధికారులు చెబుతున్నారు. కిసాన్ రిజిస్ట్రేషన్ తప్పకుండా పొంది ఉండాలని అంటున్నారు. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కిసాన్ రిజిస్ట్రీ అగ్రి స్టాక్ సహాయంతో జరుగుతోంది. కిసాన్ నిధి ఆగిపోకుండా ఉండాలంటే రైతులంతా తప్పకుండా ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలని చెబుతున్నారు. ఇందుకోసం డిసెంబర్ 31వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు.
ఈ పథకంలో భాగంగా రూపొందించిన వెబ్ పోర్టల్ https://upfr.agristack.gov.in లేదా మొబైల్ యాప్ Farmer Registry UP ద్వారా రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇందుకోసం రైతులు రైతు ఆధార్ కార్డ్, యాక్టివ్‌లో ఉన్న మొబైల్ నెంబర్ తప్పకుండా ఉండాలి. ఓటీపీ ద్వారా రిజిస్ట్రేస్ ప్రాసెస్ పూర్తి చేస్తారు. కాబట్టి మొబైల్ యాక్టివ్‌లో ఉండేలా చూసుకోవాలి. కేవలం పీఎం కిసాన్ నిధులకు మాత్రమే పరిమితం కాకుండా ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా.. రైతులు పంటల బీమా, ఉపశమనాన్ని పొందుతారు. రైతులు కిసాన్ రిజిస్ట్రీ ద్వారా విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు, బ్యాంకు రుణాలు, కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి)పై సులభంగా రాయితీలు సైతం పొందే అవకాశం ఉంటుంది.
ఇక రైతులకు ఎంత భూమి ఉంది. భూముల వ్యవహారంలో ఎలాంటి అవకతవకలు తలెత్తకుండా ఉండేందుకు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉపయోగపడుతుంది. అలాగే రైతులు కూడా తమ హక్కులను పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో ప్రభుత్వాలు అన్ని రకాల పథకాలను ఈ రిజిస్ట్రేషన్‌ను ఆధారం చేసుకునే అందించనున్నాయి. రైతులు తమ రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ను స్థానికంగా ఉన్న మీ సేవా కేంద్రాల్లో కూడా చేసుకోవచ్చు.