SSY: రూ. 5వేలు సేవ్ చేస్తే రూ. 28 లక్షలు సొంతం చేసుకోవచ్చు.. ఆడబిడ్డల కోసం స్పెషల్‌ స్కీమ్‌..!

Sukanya Samriddhi Yojana: ఆడబిడ్డ పుట్టగానే చాలా మంది పొదుపు మొదలు పెడుతుంటారు.

Update: 2024-11-04 08:36 GMT

SSY: రూ. 5వేలు సేవ్ చేస్తే రూ. 28 లక్షలు సొంతం చేసుకోవచ్చు.. ఆడబిడ్డల కోసం స్పెషల్‌ స్కీమ్‌..!

Sukanya Samriddhi Yojana: ఆడబిడ్డ పుట్టగానే చాలా మంది పొదుపు మొదలు పెడుతుంటారు. ముఖ్యంగా కూతురు వివాహ సమయానికి లేదా పై చదువుల కోసం డబ్బు పొదుపు చేసుకోవాలని ఆశిస్తుంటారు. అలాంటి వారి కోసం ఎన్నో రకాల పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం మంచి పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

సుకన్య సమృద్ధి యోజన పేరుతో తీసుకొచ్చిన ఈ పథకం ఆడ బిడ్డలు ఉన్న వారికి ఎంతో ఉపయోగపడుతుంది. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున ఈ పథకంలో పెట్టుబడి పెడుతున్నారు. మరి మీ కూతురు వివాహం సమయానికి రూ. 28 లక్షలు పొందాలంటే నెలకు ఎంత పొదుపు చేయాలి.? ఇప్పుడు తెలుసుకుందాం. కేవలం బాలికలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజన ఖాతా బ్యాంక్ లేదా పోస్టాఫీస్ లో ఓపెన్ చేయవచ్చు.

గరిష్టంగా ఇద్దరు ఆడ బిడ్డలకు మాత్రమే ఈ పథకం పొందొచ్చు. అయితే మొదట ఆడ పిల్ల పుట్టి.. రెండో కాన్పులో ఇద్దరు ఆడపిల్లు(కవల పిల్లలు) జన్మస్తే అప్పుడు ముగ్గురు పేరుపై ఖాతా తీసుకునే అవకాశం ఉంది. ఈ పథకంలో ఏడాదికి కనిష్టంగా రూ. 250 నుంచి పెట్టుబడి పెట్టొచ్చు. గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. మీ కూతురికి 15 ఏళ్లు వచ్చే వరకు పెట్టుబడి పెట్టొచ్చు.

ప్రస్తుతం ఈ పథకంలో 8.2 శాతం వడ్డీ లభిస్తోంది. ఉదాహరణకు మీ కూతురు వయసు ఏడాది ఉన్నప్పటి నుంచి పథకంలో నెలకు రూ. 5 వేలు పెట్టుబడి పెడుతూ వెళ్లారనుకుంటే.. చిన్నారికి 21 ఏళ్లు వచ్చేసరికి రూ.27,71,031 వస్తాయి. ఇలా నెలనెలా పెట్టుబడి పెంచుకుంటూ పోతే ఆదాయం పెరుగుతుంది. అయితే బాలిక 15 ఏళ్ల తర్వాత చదువుకు అవసరమైతే కొంత మొత్తంలో విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇక ఈ పథకంలో పన్ను మినహాయింపు కూడా పొందవచ్చు. సెక్షన్ 80సీ కింద రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది.

Tags:    

Similar News