Gold Price Today: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..ఏకంగా రూ. 3వేలు పతనం?
Gold Price Today: పండగ తర్వాత బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. నేడు నవంబర్ 3 ఆదివారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 80910 రూపాయలు పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 74500 రూపాయలు పలికింది. పసిడి ధరలు ఆల్ టైం రికార్డు స్థాయి నుంచి తగ్గుముఖం పడుతున్నాయి.
నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర 300 రూపాయలు తగ్గింది. అయితే బంగారం ధరలు ఇప్పటికీ కూడా ఇంకా బుల్లిష్ గానే ఉన్నాయి. బంగారం ధరలు భారీగా పెరగడం వెనుక అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు ప్రధాన కారణంగా చెబుతున్నారు. అమెరికాలో ప్రస్తుతం బంగారం ధర ఒక ఔన్సు 2780 డాలర్లుగా ఉంది. ఇది అత్యధిక స్థాయిగా చెప్పవచ్చు.
బంగారం ధరలు భవిష్యత్తులో కూడా పెరిగే అవకాశం ఉందని కూడా కొంతమంది నిపుణులు చెప్తున్నారు. . ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది బంగారం ధరలు పెరుగుతున్నాయి. దీనికి తోడు అంతర్జాతీయంగా కూడా బంగారానికి డిమాండ్ భారీగా పెరుగుతోంది. చైనా విపరీతంగా బంగారం కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కూడా బంగారానికి డిమాండ్ అమాంతం పెరిగింది. బంగారం ధరలు సమీప భవిష్యత్తులో భారీగా తగ్గే అవకాశం లేదని నిపుణులు చెప్తున్నారు.
అయితే బంగారంలో మీరు పెట్టుబడులు పెట్టాలంటే మాత్రం ఫిజికల్ బంగారం కన్నా కూడా కేంద్ర ప్రభుత్వం జారీ చేసే సావరిన్ గోల్డ్ బాండ్స్ లో పెట్టుబడి పెట్టినట్లయితే సురక్షితమని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టే పెట్టుబడి పై మీకు అదనంగా వడ్డీ కూడా లభిస్తుంది. . ఇది బంగారంతో సమానంగా ట్రేడ్ అవుతుంది. బంగారం ధర పెరిగినప్పుడల్లా మీకు ఎక్కువ రాబడి అందిస్తుంది. అలాగే బంగారు ఆభరణాల కొనుగోలు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
ఎందుకంటే బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో కొద్ది మొత్తంలో మోసం జరిగినా మీరు పెద్ద మొత్తంలో నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే తూకం విషయంలోనూ, నాణ్యత విషయంలోనూ ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడకూడదని నిపుణులు సూచిస్తున్నారు.