Gold Rate Today: మహిళలకు ఊరట..తగ్గిన బంగారం ధర

Update: 2024-12-25 02:10 GMT

Gold Rate Today: బంగారం ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ ఏడాది నవంబర్ నెలలో తులం 84వేలకు చేరి ఆల్ టైం రికార్డ్ నెలకొల్పింది. కానీ ఇప్పుడు తగ్గుతూ వస్తున్నాయి. 25 డిసెంబర్ 2024న 22 క్యారెట్ల బంగారం ధర రూ. 70,890 ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 77, 340గా ఉంది. అయితే బంగారం ధరలు తగ్గేందుకు అనేక కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల డాలర్ ధర రోజు రోజుకు పుంజుకుంటుంది.

ప్రస్తుతం డాలర్ రూ. 85వద్ద ట్రేడ్ అవుతోంది. దీంతో అమెరికా జారీ చేసే ట్రేజరీ బాండ్ల వ్యాల్యూ పెరిగింది. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు బాండ్ మార్కెట్ వైపు మొగ్గుచూపడంతో బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.

మరోవైపు అమెరికా నూతన అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా బంగారం మార్కెట్ పడిపోతోంది. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రక్షణాత్మకమైన నూతన ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇది కూడా బంగారం ధర పడిపోయేందుకు కారణం అవుతుంది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్,విజయవాడ, విశాఖలో 22క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ. 10 తగ్గింది. 70, 890 ఉంది. 24క్యారెట్ల ధర గ్రాముకు రూ. 10 తగ్గింది. రూ. 77,340గా ఉంది. కిలో వెండి రూ. 100 తగ్గింది. రూ. 98, 800 వద్ద కొనసాగుతుంది. 

Tags:    

Similar News