Gold Rates Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర ..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold Rates Today: దేశంలో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. అమెరికా డాలర్ బలపడటంతోపాటు పలు అంశాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు క్రమంగా పడిపోతున్నాయి. అయితే నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం.
దేశంలో బంగారం, వెండి ధరలు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మారుతున్నాయి. దీంతోపాటు గ్లోబల్ మార్కెట్లో ధరలు, అంతర్జాతీయ పెట్టుబడుల ప్రవాహం డాలర్ వ్యత్యాసాలు, దేశీయ మార్కెట్ నిర్ణయాలు కూడా ఈ ధరలను ప్రభావితం చేస్తాయి. ఈ క్రమంలో నేడు డిసెంబర్ 26వ తేదీ గురువారం 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 76,150కి చేరుకుంది. బుధవారంతో పోల్చితే 150 రూపాయలు స్వల్పంగా తగ్గింది.
ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 69,804కుచేరింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, విజయవాడలో 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరరూ. 76,410కి చేరుకుంది. 22క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరరూ. 70, 043కు చేరుకుంది. ఇక ధరల గురించి తెలుసుకుంటే కిలో వెండి ధర రూ. 89, 350కి చేరింది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు :
హైదరాబాద్‌లో రూ. 76,410, రూ. 70,043
విజయవాడలో రూ. 76,410, రూ. 70,043
ఢిల్లీలో రూ. 76,150, రూ. 69,804
చెన్నైలో రూ. 76,510, రూ. 70,134
ముంబైలో రూ. 76,290, రూ. 69,933
కోల్‌కతాలో రూ. 76,190, రూ. 69,841
వడోదరలో రూ. 76,390, రూ. 70,024
ప్రధాన నగరాల్లో వెండి ధరలు:
చెన్నైలో రూ. 89,470
ముంబైలో రూ. 89,210
ఢిల్లీలో రూ. 89,060
హైదరాబాద్‌లో రూ. 89,350
విశాఖపట్నంలో రూ. 89,350
వడోదరలో రూ. 89,330
కోల్‌కతాలో రూ. 89.090