Banking Services: ఆ బ్యాంకు కస్టమర్లకు బిగ్ అలర్ట్.. 2 రోజులు బ్యాంకు సర్వీసులకు అంతరాయం

Update: 2024-11-04 01:44 GMT

Banking Services: నేటికాలంలో బ్యాంకులకు వెళ్లేవారి సంఖ్య చాలా వరకు తగ్గింది. 20ఏళ్ల క్రితం బ్యాంకుల దగ్గర జనం క్యూ కట్టేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. అయితే ఇప్పుడు కొత్త సమస్యలు వస్తున్నాయి. ట్రాన్సాక్షన్లు జరిపితే ఒక్కోసారి అవి వెళ్లవు. డబ్బు వెళ్లిందో లేదో అర్థం కూడా కాదు. పే అయ్యిందో లేదో అనే గందరగోళం చాలా వరకు ఉంటుంది. దాంతో కొత్త టెన్షన్ ఇప్పుడు మొదలవుతుంది. అందువల్ల ఏ రోజున బ్యాంకు పనిచేయదో ముందే తెలుసుకుంటే ఖాతాదారులు అలర్ట్ గా ఉండవచ్చు.

హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ బ్యాంకు తన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేబోతోంది. అత్యవసర సిస్టమ్ మెయింటెనెన్స్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందువల్ల నవంబర్ 5 అర్థరాత్రి 12 నుంచి 2గంటల వరకు అలాగే నవంబర్ 23న అర్థరాత్రి 12 నుంచి 3గంటల వరకు యూపీఐ సేవలు అందుబాటులో ఉండవు.

సర్వీసులు అందుబాటులో ఉండని సమయాన్ని డౌన్ టైమ్ పీరియడ్ అంటారు. ఈ సమయంలో ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ ను హెచ్డీఎఫ్ సీ బ్యాంక్ ద్వారా నిర్వహించలేదు. కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ తోపాటు రూపే క్రెడిట్ కార్డు సేవలు కూడా డౌట్ టైమ్ సమయంలో ఉండవు. హెచ్ డీఎఫ్ సీ కస్టమర్లు డౌన్ టైమ్ సమయంలో హెచ్ డీ ఎఫ్ సీ మొబైల్ బ్యాంకింగ్ యాప్ , గూగుల్ పే, వాట్సాప్ పే, పేటీఎం, శ్రీరామ్ ఫైనాన్స్, మోబీక్విక్, క్రెడిట్ పే వంటి వాటిలో ట్రాన్సాక్షన్స్ జరిపితే అవి జరగవు. మధ్యలోనే ఆగిపోతాయి.

వ్యాపారులకు కూడా డౌన్ టైమ్ సమయంలో ట్రాన్సాక్షన్స్ వల్ల ఇబ్బందులు కలిగే ప్రమాదం ఉంది. అందుకే కస్టమర్లు సర్వీసులకు అంతరాయం ఉన్న సమయంలో పేమెంట్స్, ట్రాన్సాక్షన్స్ జరపవద్దని బ్యాంక్ సూచించింది. నవంబర్ 5 అంటే మంగళవారం నవంబర్ 23 శనివారం ఈ తేదీలను గుర్తుంచుకోవడం బెటర్.


Tags:    

Similar News