Business Idea: 'పెరుగుతోన్న బంగారం ధరే పెట్టుబడి'.. ఇప్పుడు బెస్ట్‌ బిజినెస్‌ ఇదే..!

Business Idea: సంక్షోభం నుంచే అవకాశం వెతుక్కోవాలని చెబుతుంటారు. ఇది ఉద్యోగానికైనా, వ్యాపారానికైనా బాగా వర్తిస్తుంది.

Update: 2024-11-05 06:00 GMT

Business Idea: 'పెరుగుతోన్న బంగారం ధరే పెట్టుబడి'.. ఇప్పుడు బెస్ట్‌ బిజినెస్‌ ఇదే..!

Business Idea: సంక్షోభం నుంచే అవకాశం వెతుక్కోవాలని చెబుతుంటారు. ఇది ఉద్యోగానికైనా, వ్యాపారానికైనా బాగా వర్తిస్తుంది. మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చుకుంటే భారీగా ఆదాయం ఆర్జించవచ్చు. అలాంటి ఒక బెస్ట్‌ బిజినెస్‌ ఐడియా గురించి ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం బంగారం ధరలు ఓ రేంజ్‌లో పెరిగిన విషయం తెలిసిందే. బంగారం అనే మాట వినగానే కొనుగోలుదారులు షేక్‌ అవుతున్నారు.

తులం బంగారం ధర ఏకంగా రూ. 81 వేలు దాటిసింది. త్వరలోనే బంగారం ధర రూ. లక్షకు చేరుకోవడం ఖాయమనే వార్తలు వస్తున్నాయి. దీంతో సామాన్యులకు బంగారం ఒక కలగా మారుతుందా.? అన్న అనుమానాలు వస్తున్నాయి. అయితే బంగారం ధరలకు రెక్కలొచ్చిన వేళ చాలా మంది రోల్డ్‌ గోల్డ్‌ నగలను ధరిస్తున్నారు. గోల్డ్ నగలకు ఏమాత్రం తీసిపోకుండా ఉండే ఈ నగలకు ప్రస్తుతం మార్కెట్లో బాగా డిమాండ్‌ ఉంటోంది.

అటు అన్‌లైన్‌తో పాటు ఇటు దుకాణాల్లోనూ గిల్టీ నగలను ఎక్కువగా విక్రయిస్తున్నారు. బంగారం కొనుగోలు చేసే పరిస్థితి లేకపోవడం, లక్షల విలువ చేసే నగలను వేసుకొని బయటకు వెళ్లాంటే భయపడే రోజులు రావడంతో చాలా మంది వీటినే ధరిస్తున్నారు. ఇదిగో ఈ గిల్టీ నగల వ్యాపారాన్ని ప్రారంభిస్తే ఆదాయం విషయంలో మీకు తిరుగే ఉండదు.

గిల్ట్‌ నగల వ్యాపారంలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి అప్పటికే తయారు చేసిన నగలను హోల్‌సేల్‌గా కొనుగోలు చేసి మీకు స్థానికంగా ఉన్న దుకాణాల్లో లేదా ఆన్‌లైన్‌లో మీరు విక్రయించుకొని లాభాలు పొందొచ్చు. అలా కాదు మేమే స్వయంగా గిల్ట్‌ నగలను తయారు చేస్తామనంటే అది కూడా బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. గిల్ట్‌ నగల తయారీకి సంబంధించి మార్కెట్లో రకరకాల మిషినరీలు అందుబాటులో ఉన్నాయి. ఇందుకోసం ముందుగా రాగితో తయారు చేసిన ఆభరణాలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాటికి గోల్డ్ ప్లేటింగ్ వేయాల్సి ఉంటుంది. ఈ వ్యాపారాన్ని చాలా తక్కువ స్థలంలోనే ప్రారంభించుకోవచ్చు. లాభాలు కూడా ఓ రేంజ్‌లో ఉంటాయి. 

Tags:    

Similar News