GST Collections: అక్టోబరులో రికార్డ్ స్థాయిలో జీఎస్టీ వసూళ్లు.. ఎంతంటే..?

GST Collections: జీఎస్టీ వసూళ్ల లో అక్టోబర్ నెలలో 8.9 శాతం పెరిగాయి. రూ. 1,87,346 కోట్లు వసూలయ్యాయి.

Update: 2024-11-02 07:20 GMT

GST Collections: అక్టోబరులో రికార్డ్ స్థాయిలో జీఎస్టీ వసూళ్లు.. ఎంతంటే..?

GST Collections: జీఎస్టీ వసూళ్ల లో అక్టోబర్ నెలలో 8.9 శాతం పెరిగాయి. రూ. 1,87,346 కోట్లు వసూలయ్యాయి. ఏప్రిల్ లో 2.1 లక్షల కోట్లు వసూలయ్యాయి. జీఎస్టీ వసూళ్లలో ఇది అత్యధికం. అక్టోబర్ నెల జీఎస్టీ వసూళ్లలో రెండో స్థానంలో నిలిచింది. అధికారిక లెక్కల ప్రకారంగా సెప్టెంబరులో 10.6 శాతం పెరిగి రూ.1.42 కోట్లకు చేరుకున్నాయి. దిగుమతులపై విధించిన పన్నులు నాలుగు శాతం పెరిగి రూ. 45,096 కోట్లు వసూలయ్యాయని కేంద్రం తెలిపింది. ఇదే నెలలో రూ. 19, 306 కోట్ల రిఫండ్లు జారీ అయ్యాయి.

సీజీఎస్టీ రూపంలో రూ.33,821 కోట్లు, ఎస్ జీ స్టీ రూపంలో రూ.41,864 కోట్లు, ఐజీఎస్టీ రూపంలో రూ.99,111 కోట్లు సమకూరాయి. 2023-24 ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే 11.7 శాతం పెరుగుదలతో 20.18 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2017 జూలై 1 నుంచి ఇండియాలో వ్యాట్ స్థానంలో జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. 2023 అక్టోబర్ తో పోలిస్తే ఇది 18.2 శాతం ఎక్కువ. రీఫండ్స్ మినహాయిస్తే నికర జీఎస్టీ వసూళ్లలో 8 శాతం వృద్దితో రూ.1.68 లక్షల కోట్లుగా ఉన్నాయి.

Tags:    

Similar News