Gold Rate Today: పెళ్లిళ్ల సీజన్ లో మళ్లీ బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈమధ్య భారీగా తగ్గిన బంగారం ధర మరింత దిగొస్తుందనుకుంటున్న సమయంలో రేట్లు మరోసారి ఎగబాకుతున్నాయి. వరుసగా రెండో రోజు కూడా బంగారం ధర భారీగా పెరగడం బంగారం ప్రియుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇంటర్నేషనల్ మార్కెట్లలోనూ ధరలు పుంజుకుంటున్నాయి. ప్రస్తుతం ఎక్కడ బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం.
హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 5500పైగా పతనం అయ్యింది. అయితే పరిస్థితి మళ్లీ తారుమారు అయ్యింది. 10 నుంచి 15రోజుల వరకు తగ్గిన బంగారం ధరలు ఇప్పుడు మళ్లీ పుంజుకుంటున్నాయి. అసలే ఇప్పుడు దేశంలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈ క్రమంలో డిమాండ్ పెరిగి ధర ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 700 పెరిగింది. దీంతో తులం ఇప్పుడు రూ. 70,650 మార్కుకు చేరుకుంది.
దీనికి ముందు రోజు కూడా రూ. 600 పెరిగింది. ఇక 24క్యారెట్ల బంగారం ధర రూ. 760 పెరిగి పది గ్రాములకు ఇప్పుడు రూ. 77,070 వద్ద కొనసాగుతోంది. ఇది కూడా మునుపటి రోజు రూ. 660 పెరిగింది. దీంతో రెండు రోజుల్లోనే 1420పెరిగింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో చూసినట్లయితే..700 పెరిగిన 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం పది గ్రాములకు రూ. 70,800కు చేరుకుంది. 24క్యారెట్ల బంగారం ధర తులం రూ. 77,220 వద్ద ఉంది.
మరోవైపు బంగారం ధర బాటలోనే వెండి ధరలు కూడా ఉన్నాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 2వేలు పెరిగింది. ప్రస్తుతం రూ. 91,500 మార్కును తాకింది. దీనికి ముందు దాదాపు 15రోజులు ధరలు పెరగలేదు. ఇప్పుడు మాత్రం ధరపెరిగింది. ఇక హైదరాబాద్ నగరంలో చూస్తే ఇక్కడ రూ. 2వేలు పెరగడంతో ప్రస్తుతం కేజీకి రూ. 1,01 లక్షలు పలుకుతోంది. బంగారం, వెండి ధరలు ప్రాంతాలను బట్టి మారుతుంటాయి.