Gold Price: ఇదేం పెరుగుడు..మూడోరోజు పెరిగిన బంగారం,వెండి ధరలు

Update: 2024-11-21 01:49 GMT

Gold Rate Today: పసిడి ప్రియులకు సడెన్ షాకిచ్చిన బంగారం ధర..ఎంత పెరిగిందంటే

Gold Price: బంగారం, వెండి కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నవారికి మళ్లీ షాకింగ్ న్యూస్. ఎందుకంటే దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. వరుసగా మూడోరోజు కూడా ధరలు పెరిగాయి. ఈమధ్య పసిడి ధర రికార్డు స్థాయిలో 80వేల స్థాయిని దాటగా గతవారం 76వేల స్థాయికి దిగివచ్చింది. కానీ ఇప్పుడు మళ్లీ ఈ ధరలు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భౌగోళిక, రాజకీయ, ఆర్ధిక కారణాలతోపాటు స్టాక్ మార్కెట్ల ధోరణులు కూడా ఈ బంగారం ధరలు హెచ్చుతగ్గులపై ప్రభావం చూపుతున్నాయి.

ఈ నేపథ్యంలో నేడు నవంబర్ 21న హైదరాబాద్, విజయవాడలో 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 550 పెరిగి రూ. 77,630కి చేరింది. ఇక 22క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 71,160స్థాయికి చేరుకుంది. ఢిల్లీలో 24క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 77,780కి చేరుకోగా..22క్యారెట్ల పుత్తడి ధర పది గ్రాములకు రూ. 71,310కి చేరుకుంది. అటు వెండి ధరలు కూడా కిలోకు 4000 రూపాయలు తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి ధరలు ఇప్పుడు చూద్దాం.

హైదరాబాద్‌లో రూ. 77,630, రూ. 71,160, ఢిల్లీలో రూ. 77,780, రూ. 71,310, విజయవాడలో రూ. 77,630, రూ. 71,160, వడోదరలో రూ. 77,680, రూ. 71,210, చెన్నైలో రూ. 77,630, రూ. 71,160, ముంబైలో రూ. 77,630, రూ. 71,160, బెంగళూరులో రూ. 77,630, రూ. 71,160, పూణేలో రూ. 77,630, రూ. 71,160, కేరళలో రూ. 77,630, రూ. 71,160, కోల్‌కతాలో రూ. 77,630, రూ. 71,160 పలుకుతోంది.

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. వీటిని కొనుగోలు చేసేటప్పుడు మళ్లీ ధరలు తెలుసుకోవాలి. 

Tags:    

Similar News