Swiggy: స్విగ్గీ స్నాక్‌ పేరుతో కొత్త యాప్‌.. ఉపయోగం ఏంటంటే..!

Swiggy: ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో కంపెనీలు రకరకాల ఆలోచనలతో వినియోగదారులను అట్రాక్ట్‌ చేస్తున్నాయి.

Update: 2025-01-08 10:17 GMT

Swiggy: స్విగ్గీ స్నాక్‌ పేరుతో కొత్త యాప్‌.. ఉపయోగం ఏంటంటే..!

Swiggy: ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో కంపెనీలు రకరకాల ఆలోచనలతో వినియోగదారులను అట్రాక్ట్‌ చేస్తున్నాయి. సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. SNACC పేరిటి కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. ఇంతకీ ఈ యాప్‌ ఉపయోగం ఏంటి.? ఎలాంటి సేవలు పొందొచ్చు.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

SNACC పేరిట తీసుకొచ్చిన ఈ యాప్‌ సహాయంతో క్విక్‌ బైట్స్‌, బేవరేజెస్‌, ఫుడ్‌ డెలివరీలను పొందొచ్చు. కేవలం 15 నిమిషాల్లోనే ఫుడ్‌ డెలివరీ చేసే సదుపాయాన్ని ఇందులో తీసుకొచ్చారు. ఇప్పటికే ఈ సేవలను బెంగళూరులో అందుబాటులోకి తీసుకొచ్చారు. క్విక్‌ కామర్స్‌ సేవల్లో భాగంగానే స్విగ్గీ ఈ కొత్త యాప్‌ను తీసుకొచ్చినట్లు ప్రకటించింది. త్వరలోనే ఇతర ప్రాంతాల్లోనూ ఈ సేవలను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే జొమాటో అనుబంధ సంస్థ బ్లింకిట్‌ 10 నిమిషాల్లోనే స్నాక్స్, ఇతర ఆహార పదార్థాలను డెలివరీ అందించేందుకు బిస్ట్రో యాప్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక జెప్టో సైతం కేఫ్‌ ఆఫరింగ్స్ కోసం ‘జెప్టో కేఫ్‌’ పేరిట యాప్‌ను లాంచ్‌ చేసింది. వీలైనంత త్వరగా వస్తువులను డెలివరీ చేసే ఉద్దేశంతో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఈ నేపథ్యంలోనే స్విగ్గీ కూడా కొత్త యాప్‌ను తీసుకొచచింది. స్విగ్గీ ఇప్పటివరకు ఫుడ్‌ డెలివరీ, క్విక్‌ కామర్స్‌, డైన్‌ ఔట్‌ అన్నింటినీ ఒకే అప్లికేషన్‌ కింద అందిస్తోంది. ఇక 10 నిమిషాల ఫుడ్‌ డెలివరీ కోసం ‘బోల్ట్‌’ సేవల్ని గతేడాదిలోనే ప్రారంభించింది. అయితే తాజాగా కేవలం 15 నిమిషాల్లోనే డెలివరీ కోసం ఈ కొత్త యాప్‌ తీసుకొచ్చింది. ఈ యాప్‌ ద్వారా ఫాస్ట్ ఫుడ్‌, డ్రింక్స్‌ వంటివి అందించనున్నారు. 

Tags:    

Similar News