HDFC Bank: కస్టమర్లకు శుభవార్త చెప్పిన హెచ్‌డీఎఫ్‌సీ..లోన్ తీసుకునేవారికి ఊరట?

Update: 2025-01-08 02:38 GMT

HDFC Bank: దేశంలోని ప్రముఖ బ్యాంకుల్లో ఒక్కటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన కస్టమర్ల కోసం కీలక ప్రకటన చేసింది. ఇది ఆ బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త అని చెప్పవచ్చు. ముఖ్యంగా లోన్స్ తీసుకునే వారికి ఇది మరింత ఊరటనిచ్చే నిర్ణయంగా చెప్పుకోవచ్చు. కొన్నేళ్ల తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింట్ రేట్లను తగ్గిస్తున్నట్లు బ్యాంకు ప్రకటించింది. ఈ రేట్లు రుణ ఆధారిత వడ్డీరేట్లుగా పిలుస్తారు. బ్యాంకు 5 బేసిస్ పాయింట్ల వరకు ఎంసీఎల్ఆర్ తగ్గించగా...సవరించిన ఈ రేట్లు 2025 జనవరి 7వ తేదీ అంటే మంగళవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ మార్పుల తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఎంసీఎల్ఆర్ 9.15 శాతం నుంచి 9.5 శాతం మధ్య ఉంటుందని బ్యాంకు తెలిపింది.

ఎంసీఎల్ ఆర్ అనేది రుణ ఆధారిత కనిష్ట వడ్డరేటు. అంటే బ్యాంకులు లోన్స్ పై వసూలు చేసే గరిష్టంగా తక్కువగా వడ్డీరేటు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకులకోసం ఒకే విధానాన్ని నిర్దారించేందుకు ఎంసీఎల్ఆర్ ను ప్రవేశపెట్టింది. బ్యాంకులు ఈ రేటుపై ఆధారపడి లోన్స్ వడ్డీరేట్లను నిర్ణయిస్తాయి. ఎంసీఎల్ఆర్ తక్కువైతే లోన్స్ పై వడ్డీ తగ్గుతుంది. అదే ఎంసీఎల్ ఆర్ పెరిగితే వడ్డీరేట్లు కూడా పెరుగుతాయి. దీంతో ఎంసీఎల్ఆర్ తగ్గితే ఈఎంఐ కూడా తగ్గుతుంది. పెరిగితే ఈఎంఐ పెరుగుతుంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఓవర్‌నైట్ ఎంసీఎల్ ఆర్ 9.20 శాతం నుండి 9.15 శాతానికి తగ్గించింది. ఒక నెల ఎంసీఎల్ ఆర్ 9.20 శాతం, ఎలాంటి మార్పు లేదు. 3 నెలలకు ఎంసీఎల్ ఆర్ 9.30 శాతం. దీనిలో ఎలాంటి మార్పులు చేయలేదు. 6 నెలల ఎంసీఎల్ ఆర్ 9.45 శాతం నుండి 9.40 శాతానికి తగ్గించింది. ఒక సంవత్సరంఎంసీఎల్ ఆర్ 9.45 శాతం నుండి 9.40 శాతానికి తగ్గించింది. 2 సంవత్సరాల కంటే ఎక్కువ కాలానికి ఎంసీఎల్ ఆర్ 9.45 శాతం. దీనిలో కూడా ఎలాంటి మార్పులు చేయలేదు. 3 సంవత్సరాల కాలానికి ఎంసీఎల్ ఆర్ 9.50 శాతం నుండి 9.45 శాతానికి తగ్గించింది.

Tags:    

Similar News