Safe Investment: ఈ స్కీములో నెలకు రూ. 5వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు కోటీశ్వరులు అవ్వడం ఖాయం
Safe Investment: మీరు ఎలాంటి రిస్క్ లేకుండా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ స్కీము గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్.. ప్రభుత్వం అందించే ఒక సురక్షిత లాభదాయకమైన పొదుపు స్కీమ్. ప్రజలకు దీర్ఘకాలిక పొదుపు పన్ను మినహాయింపు నుంచి మంచి వడ్డీ రేటు అందించడమే ఈ స్కీమ్ ప్రధాన లక్ష్యం. పీపీఎఫ్ ఖాతా ప్రారంభించడానికి ఎలాంటి ప్రాథమిక అర్హతలు అవసరం లేదు. అది భారతదేశంలోని ఏ నగరంలో అయినా ప్రారంభించవచ్చు. ప్రతి ఏడాది కనీసం రూ. 500ల నుంచి గరిష్టంగా 1,50,000 వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు.
ఈ పథకంలో పెట్టుబడులకు 15 ఏళ్ల కాలపరిమితి ఉంటుంది. కానీ నాణ్యమైన అభ్యర్థనతో కాలాన్ని మరింత పొడిగించుకోవచ్చు. దీనిలో వడ్డీ పన్ను మినహాయింపు ఉంటుంది. సాధారణంగా 7-8 శాతం వడ్డీ రేటు ఉంటుంది. అది క్రమంగా మారుతూ ఉంటుంది.
ప్రస్తుతం పీపీఎఫ్ స్కీమ్ లో వడ్డీ రేటు 7.10 శాతం ఉంది. ఈ వడ్డీరేటు స్థిరంగా ఉంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వము సవరిస్తుంది. కనీసం 500 రూపాయలతో ప్రారంభించి గరిష్టంగా 1.50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. పీపీఎఫ్ స్కీమ్ లో లాగిన్ పీరియడ్ కనీసం 15 సంవత్సరాలు ఉంటుంది. అయితే ఈ సమయంలో వడ్డీ రేట్లు మారుతూ ఉండొచ్చు. 15 ఏళ్ల తర్వాత ఐదేళ్ల చొప్పున పొడిగించుకునే అవకాశం ఉంటుంది. మీరు మీ పెట్టుబడిని తక్కువతో మొదలుపెట్టి ఒక నెలకు 5వేల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేస్తే ఆ మొత్తం డబ్బు 15 ఏళ్లలో 16.27లక్షలు వస్తాయి. 20 ఏళ్లలో 26.63లక్షలు, 25ఏళ్లలో రూ. 41.23లక్షలను పొందవచ్చు.
మీరు కొంచెం ఎక్కువగా కలిపినట్లయితే నెలకు రూ. 10,000 పెడితే 15ఏళ్లలో రూ.32.54లక్షలు, 20ఏళ్లలో రూ.53.26లక్షలు, 25ఏళ్లలో రూ. 82.46 లక్షలను పొందవచ్చు. మీరు గరిష్ట పెట్టుబడి రూ.1.50లక్షల రూపాయలు అంటే నెలకు రూ. 12,500 చొప్పున ఇన్వెస్ట్ చేస్తే అది 15ఏళ్లలో రూ. 40.68లక్షలు, 20ఏళ్లలో రూ. 66.58లక్షలు, 25ఏళ్లలో రూ. 1,03,08,015 పొందవచ్చు.
ఈ విధంగా పిపిఎఫ్ పథకంలో ఎలాంటి రిస్క్ లేకుండా లాభాలు, పన్ను ప్రయోజనాలు పొందుతూ మీరు కోటీశ్వరులు అయ్యేందుకు మీకు సహాయం చేస్తాయి,
(Disclaimer: డబ్బు పెట్టుబడులకు సంబంధించిన అంశాల్లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి అంశాలపై నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుల సలహాలు సూచనలు పాటించడం ముఖ్యం. మీ పెట్టుబడులకు హెచ్ఎంటీవీ ఎలాంటి బాధ్యత వహించదు.)