Gold Rate Today: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్..80వేలకు చేరిన బంగారం ధర

Update: 2025-01-09 00:25 GMT

Gold Rate Today: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాములు తులం బంగారం ధర 80వేలకు చేరుకుంది. ఈ నేపథ్యంలో నేడు జనవరి 9వ తేదీ గురువారం హైదరాబాద్ తో సహా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి.కొత్త సంవత్సరం ప్రారంభంలో తగ్గుతూ..స్థిరంగా ఉన్న బంగారం ధరలు నేడు భారీగా పెరిగాయి. ఆల్ టైం గరిష్టానికి చేరుకున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80, 050 ఉండగా..22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,850 రూపాయలు పలుకుతోంది.

బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణంగా అంతర్జాతీయంగా నెలకున్న మార్కెట్ పరిస్థితులే అని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి అమెరికా మార్కెట్లో ప్రస్తుతం బంగారం ధర భారీగా పెరిగుతోంది. ఒక ఔన్సు బంగారం ధర 2670 డాలర్ ఎగువన ట్రేడ్ అవుతోంది.

బంగారం ధర పెరగడానికి మరో ప్రధాన కారణం ఏంటంటే అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఆశించిన విధంగా ఆర్థిక గణాంకాలు రాకపోవడం కూడా ఒక కారణమనిచెప్పవచ్చు. అలాగే అమెరికాలో ఆర్థిక సంక్షోభం నీడలు పెట్టుబడిదారులను భయపెడుతున్నాయి.

ఈ కారణంగా బంగారం ధర భారీగా పెరిగేందుకు దోహదపడింది. పెట్టుబడి దారులు తమ పెట్టుబడులను సురక్షితమైన పసిడి వైపు తరలించేందుకు సిద్ధంగా ఉంటున్నారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగేందుకు కారణం అవుతుందని చెప్పవచ్చు. 

Tags:    

Similar News