Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం ధర... ఎంత పెరిగిందో తెలిస్తే షాక్ అవ్వడం పక్కా

Update: 2025-01-07 23:51 GMT

Gold Rate Today: బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. నేడు జనవరి 8వ తేదీ బుధవారం బంగారం ధర పెరిగింది. మంగళవారంతో పోల్చితే బుధవారం బంగారం ధర దాదాపు 500 రూపాయలు పెరిగింది. 24క్యారెట్ల బంగారం ధర మరోసారి 10 గ్రాములకు గాను 80వేలకు దిశగా పయనిస్తోంది. బంగారం ధరలు ఇవాళ ఎలా ఉన్నాయో చూద్దాం.

నేడు జనవరి 8వ తేదీ బుధవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 79, 920 ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరరూ. 72, 750రూపాయలు పలుకుతోంది. కేజీ వెండి ధర రూ. 92,303 పలుకుతోంది.

దేశంలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదు అవుతున్న తరుణంలో అటు ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సురక్షితమైన బంగారం వైపు తరలించేందుకు సిద్ధం అవుతున్నారు. దీంతో బంగారం ధరలు భారీగా పెరుగుదల వైపు అడుగులు వేస్తున్నాయి.

బంగారం ధరలు పెరగడానికి మరో ప్రధాన కారణం ఏంటంటే అంతర్జాతీయంగా సెంట్రల్ బ్యాంకులు మరోసారి బంగారం పెద్ద ఎత్తున కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఇది కూడా బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. 

Tags:    

Similar News