Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. మరింత దిగివచ్చిన బంగారం, వెండి ధరలు
Gold Rate Today: దేశంలో బంగారం ధరలు మరింత దిగి వచ్చాయి. నేడు జనవరి 6వ తేదీ సోమవారం బంగారం, వెండి ధరలు తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
దేశంలో నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10 దిగివచ్చింది. రూ. 78,700పలుకుతోంది. క్రితం రోజు ఈ ధరరూ. 78,710గా ఉంది. అదే సమయంలో 100గ్రాముల బంగారం ధరరూ. 100 దిగి వచ్చింది. రూ. 7,87,000గా ఉంది. గ్రాము బంగారం ధర రూ. 7,870 ఉంది. మరోవైపు 10 గ్రాముల బంగారం ధర రూ. 10 దిగివచ్చింది. రూ. 72,140కిచేరుకుంది. ఆదివారం ఈ ధర రూ. 72, 150గా ఉంది. ఇక 100 గ్రాముల బంగారం ధర రూ. 100 తగ్గి రూ. 7,21,400గా ఉంది. గ్రాము బంగారం ధర ప్రస్తుతం 7,214గా ఉంది.
దేశంలోని కీలక ప్రాంతాల్లో కూడా బంగారం ధరలు సోమవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారెట్ల బంగారం ధర రూ. 72, 290గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 78, 850గా ఉంది. కోల్ కతాలో ప్రస్తుతం 22క్యారెట్ల బంగారం ధరరూ. 72, 140 పలుకుతోంది. 24క్యారెట్ల బంగారం 78,700గా ఉంది. ముంబై, పుణె, కేరళలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్ లో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 72,140గా ఉంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 78,700గా ఉంది. విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. విశాఖలోనూ ఇవే ధరలు ఉన్నాయి.
ఇక వెండి ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 100 గ్రాముల వెండి ధర రూ. 9,140గా ఉంది. కిలో వెండి ధర రూ. 100 తగ్గి 91,400వద్ద కొనసాగుతోంది. ఆదివారం ఈ ధర రూ. 91,500గా ఉంది.