Ketan Parekh: ఫ్రంట్ రన్నింగ్ స్కామ్ తో రూ. 65 కోట్ల లాభాలు

కేతన్ పరేఖ్ కు (Ketan Parekh) ఫ్రంట్ రన్నింగ్ కుంభకోణంతో సంబంధం ఉందని సెబీ (Sebi) నిర్ధారించింది.

Update: 2025-01-03 06:14 GMT

Ketan Parekh: ఫ్రంట్ రన్నింగ్ స్కామ్ తో రూ. 65 కోట్ల లాభాలు

కేతన్ పరేఖ్ కు (Ketan Parekh) ఫ్రంట్ రన్నింగ్ కుంభకోణంతో సంబంధం ఉందని సెబీ (Sebi) నిర్ధారించింది. రూ.65.77 కోట్ల లాభాలను కేతన్ చట్ట వ్యతిరేకంగా లాభాలు పొందారని గుర్తించిన సెబీ... వాటిని తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. ఇదే వ్యవహారంలో 22 కంపెనీలకు షోకాజ్ (Show Cause) పంపారు.

సెబీ పూర్తి కాల సభ్యుడు కమేశ్ వార్ష్ నీ జారీ చేసిన ఆదేశాల మేరకు రోహిత్ సల్గావ్ కర్, కేతన్ పరేఖ్ లు ఈ కుంభకోణాన్ని నడిపారని ఆరోపించారు. ఓ క్లయింట్ కు చెందిన ఎన్ పీ ,ఐ నుంచి ఫ్రంట్ రన్నింగ్ కార్యకలాపాలను నిర్వహించారు. ఆశోక్ కుమార్ పొద్దార్ ఈ కార్యకలాపాలకు మధ్యవర్తిగా ఉన్నట్టు అంగీకరించారని తెలిపారు.

అసలు ఏం జరిగింది?

ఏదైనా ట్రేడ్ గురించి సాధారణ మదుపర్ల కంటే కొందరికి మాత్రమే సమాచారం ఉంటే దానిని ఫ్రంట్ రన్నింగ్ గా చెబుతారు. ఓ సంస్థకు చెందిన ట్రేడర్లతో రోహిత్ కు పరిచయం ఉంది. వీరంతా తాము చేపట్టబోయే ట్రేడ్ ల సమాచారం పంచుకున్నారు. దీన్ని కేతన్ పరేఖ్ కు రోహిత్ అందించారు. దీని ఆధారంగా చట్ట వ్యతిరేకంగా లాభాలను పొందారని చెబుతున్నారు. 14 ఏళ్లు సెక్యూరిటీస్ మార్కెట్లు కేతన్ పరేఖ్ పై నిషేధం విధించాయి.

Tags:    

Similar News