2000 Notes: ఇంకా మీదగ్గర రూ.2000నోట్లు ఉన్నాయా.. శుభవార్త చెప్పిన ఆర్‌బీఐ..!

2000 Rupee Notes Update : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నూతన సంవత్సరం మొదటి రోజున రూ. 2,000 నోట్లపై కీలక అప్ డేట్ ఇచ్చింది.

Update: 2025-01-02 10:09 GMT

2000 Notes: ఇంకా మీదగ్గర రూ.2000నోట్లు ఉన్నాయా.. శుభవార్త చెప్పిన ఆర్‌బీఐ..!

2000 Rupee Notes Update : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నూతన సంవత్సరం మొదటి రోజున రూ. 2,000 నోట్లపై కీలక అప్ డేట్ ఇచ్చింది. చెలామణి నుండి ఉపసంహరించబడిన రూ. 2,000 నోట్లలో 98.12 శాతం బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చినట్లు ప్రకటించింది. డిసెంబర్ 31, 2024 నాటికి ఇంకా ప్రజల వద్ద రూ.6,691 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు మిగిలి ఉన్నాయని తెలిపింది. ఇది మే 19, 2023న నోట్ల రద్దు సమయంలో చెలామణిలో ఉన్న మొత్తం విలువ రూ.3.56 లక్షల కోట్ల కంటే చాలా తక్కువని ఆర్‌బీఐ వెల్లడించింది.

మే 19, 2023 వరకు చెలామణిలో ఉన్న రూ. 2000 నోట్లలో 98.12 శాతం తిరిగి వచ్చినట్లు ఆర్‌బిఐ ఒక ప్రకటనలో తెలిపింది. రూ.2000 నోట్లను మార్చుకునే లేదా డిపాజిట్ చేసుకునే సదుపాయం అన్ని ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో అందుబాటులో ఉంది. ఇక్కడ వ్యక్తులు లేదా సంస్థలు వారి దగ్గర ఉన్న రూ.2000నోట్లను బ్యాంకు ఖాతాలలో డిపాజిట్ చేయవచ్చు.

ఆర్‌బిఐ కార్యాలయాలు అక్టోబర్ 9, 2023 నుండి డిపాజిట్‌ల కోసం రూ. 2000 నోట్లను స్వీకరిస్తూనే ఉన్నాయి. తమ ఖాతాలలో డిపాజిట్ చేయడానికి ఆర్‌బిఐ ఏదైనా ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయానికి ఇండియా పోస్ట్ ద్వారా నోట్లను పంపడానికి అనుమతించాయి. చెలామణి నుండి ఉపసంహరించబడినప్పటికీ రూ. 2000 నోట్లు చట్టబద్ధంగా ఉంటాయి. నోట్లను స్వీకరించే 19 ఆర్బీఐ కార్యాలయాలు అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలలో ఉన్నాయి. వీటిని సందర్శించి మీ దగ్గర ఉన్న రూ.2000నోట్లను మార్చుకోవచ్చు. రూ.1000, రూ.500 నోట్ల రద్దు తర్వాత 2016 నవంబర్‌లో తొలిసారిగా ఈ రూ.2000 నోట్లను విడుదల చేశారు.

Tags:    

Similar News