EPFO: పీఎఫ్ ఖాతాదారులూ..UAN పేరు తప్పుగా పడిందా?ఈ డాక్యుమెంట్లు ఉంటే చాలు ఈజీగా మార్చుకోవచ్చు.

EPFO: ఈపీఎఫ్ఓ యుఎన్ఏలో మీ పేరు తప్పుగా పడిందా? పేరు స్పెల్లింగ్ లో అదనపు అక్షరాలు వచ్చాయా? అయితే మీ పేరును సరి చేసుకోవాలని అనుకుంటున్నారా ?అయితే ఇది మీకోసమే మీ దగ్గర ఈ మూడు డాక్యుమెంట్లు ఉంటే చాలు ఈజీగా మార్చుకోవచ్చు. తాజాగా ఈపీఎఫ్ఓ ఈ కీలక ప్రకటన చేసింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడే తెలుసుకుందాం.

Update: 2025-01-03 11:56 GMT

EPFO: ఈపీఎఫ్ఓ యుఎన్ఏలో మీ పేరు తప్పుగా పడిందా? పేరు స్పెల్లింగ్ లో అదనపు అక్షరాలు వచ్చాయా? అయితే మీ పేరును సరి చేసుకోవాలని అనుకుంటున్నారా ?అయితే ఇది మీకోసమే మీ దగ్గర ఈ మూడు డాక్యుమెంట్లు ఉంటే చాలు ఈజీగా మార్చుకోవచ్చు. తాజాగా ఈపీఎఫ్ఓ ఈ కీలక ప్రకటన చేసింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడే తెలుసుకుందాం.: మీకు పిఎఫ్ అకౌంట్ ఉందా? ప్రతినెలా ఈపీఎఫ్ అకౌంట్ కి చాలా జమ చేస్తున్నారా? అయితే మీ పిఎఫ్ అకౌంట్ యూనివర్సిటీ అకౌంట్ నెంబర్లో ఎలాంటి తప్పు లేకుండా చూసుకోవాల్సిందే. లేదంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు తలెత్తుతాయి.

పేరు తప్పుగా పడితే ఏం చేయాలో తెలుసా? అందుకు మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తాజాగా ఈపీఎఫ్ఓ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేసింది. యుఏఎన్ లో పేరుతో పాటు ఇతర మార్పులు చేసుకునేందుకు ఛాన్స్ కల్పిస్తున్నట్లు తెలిపింది. అందుకు కొన్ని డాక్యుమెంట్స్ సూచించింది. అందులో ఏ మూడు డాక్యుమెంట్లు అందుబాటులో ఉన్న సులభంగా మార్చుకోవచ్చని వెల్లడించింది. మరి ఆ వివరాలు తెలుసుకుందామా?

అకౌంట్ పేరులో రెండు అక్షరాల కన్నా ఎక్కువగా మార్పులు ఉంటే.. రెండు అక్షరాలు తక్కువగా మార్పులు ఉన్న లేక పేరును పొడిగించాలనుకుంటున్న మారుతుందని ఈపీఎఫ్ఓ ఎక్స్ వేదికగా వెల్లడించింది. మీ యు ఏ ఎన్ లో పేరుగా తప్పుగా ఉంటే దానిని ఎలా సరి చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పేరులో ఫొనెటిక్ ఎర్రర్స్ లేదా పూర్తి పేరు పొడిగింపు వంటి ప్రధాన మార్పులు చేసుకునేందుకు కనీసం మూడు డాక్యుమెంట్లు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. మీరు ఆన్లైన్లోనే ఈ పనిని ఈజీగా పూర్తి చేసుకోవచ్చు అని ఈపీఎఫ్ఓ పేర్కొంది. కావలసిన డాక్యుమెంట్లను కూడా సూచించింది.

కావలసిన డాక్యుమెంట్ లేవు చూద్దాం:

-ఆధార్ కార్డ్, పాస్ట్ పోర్ట్, డెత్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్, కేంద్ర, రాష్ట్ర, యూటీ ప్రభుత్వాలు బ్యాంకులు, పీఎస్ యూ సంస్థలు జారీ చేసిన --ఫొటో ఐడీ కార్డులు.

ఫోటో, స్టాంప్ కలిగిన బ్యాంక్ పాస్ బుక్

పాన్ కార్డ్ లేదా ఈ పాన్

ఓటర్ ఐడి కార్డ్

పెన్షనర్ ఫోటో కార్డ్ లేదా ఫ్రీడమ్ ఫైటర్ ఫోటో కార్డ్

సిహెచ్ఎఎస్, ఇసిహెచ్ఎస్, మెడి క్లెయిమ్స్ కార్డులు

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సర్టిఫికెట్లు

పూర్తి పేరు మార్పు లేదా ఫస్ట్ నేమ్ మార్చుకునే పీఎఫ్ ఖాతాదారులు కచ్చితంగా కొత్త పేరుతో జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ దాని అనుబంధ డాక్యుమెంట్లు ఇవ్వాల్సి ఉంటుంది.

వాలిడి వీసా

ఫోటోతో ఉన్న ఫ్రీడమ్ ఫైటర్ కార్డ్

ఇతర విదేశీ జాతీయుల విషయంలో పాస్పోర్ట్ చెల్లుబాటు అయ్యే వీసా ఉండాలి

ప్రభుత్వం జారీ చేసిన పర్సన్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్ కార్డు

ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా

టిబెటన్ శరణార్థి కార్డు

పైన పేర్కొన్న డాక్యుమెంట్లలో ఆధార్ కార్డు తప్పనిసరిగా ఇవ్వాలి. మిగిలిన వాటిలో ఏ రెండు కార్డుల సమర్పించినా సరిపోతుందని యూనియన్ లో పేరు తప్పుగా పడిన పూర్తిగా మార్చుకోవాలి అనుకుంటున్నావారికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు.

Tags:    

Similar News