Gold Rate Today: కొత్త ఏడాదిలో షాకిస్తున్న బంగారం ధరలు.. నేడు భారీగా పెరిగిన పసిడి ధర. నేటి ధరలు ఇవే
Gold Rate Today: కొత్త ఏడాదిలో పసిడి ప్రియులకు షాక్ ఇస్తున్నాయి బంగారం ధరలు. గత మూడు రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. నేడు జనవరి 3తేదీ శుక్రవారం బంగారం ధర రికార్డ్ స్థాయిలో పెరిగింది. పసిడి ధరలు మరోసారి 80 వేల మార్క్ కు చేరువవుతున్నాయి. 10 గ్రాముల బంగారం ధర నేడు ఎంత ఉందో తెలుసుకుందాం.
బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులే అని చెప్పవచ్చు. తాజాగా బంగారం ధరలు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79580 పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,400 రూపాయలు పలుకుతుంది. బంగారం ధరలు పెరగడానికి కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బంగారం ధర అమెరికాలో ఔన్స్ 2650 డాలర్ గా ఉంది. బంగారం ధర గత కొంతకాలంగా హెచ్చుతగ్గులకు గురవుతుంది. ఒక దశలో 76 వేల రూపాయలకు పడిపోయిన బంగారం ధర.. ఇప్పుడు నెమ్మదిగా రికవరీ అవుతుంది. ప్రస్తుతం 79 వేల వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ నేపథ్యంలో పసిడి ప్రియులు ఆందోళన చెందుతున్నారు.
బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని అంతా భావించారు. కానీ బంగారంలో ఇన్వెస్ట్ చేసేందుకు మరోసారి పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తున్నారు . దీనికి ప్రధాన కారణం అమెరికా ఆర్థిక గణాంకాలు అని చెప్పవచ్చు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు త్వరలోనే చేపట్టనున్న నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుతాయని భావించినప్పటికీ ప్రస్తుతం మాత్రం పెరుగుదల దశలోనే ఉన్నాయి.
బంగారం ధరలు పెరగడానికి మరో ప్రధాన కారణం ఏమిటంటే.. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగడం అని చెప్పవచ్చు. సెంట్రల్ బ్యాంకులు ఒకవేళ పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేసినట్లయితే బంగారం ధర భారీగా పెరుగుతుంది .