Anant Ambani: అనంత్ అంబానీ పెట్టుకున్న వాచ్..ఖరీదు ఎంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే

Update: 2025-01-02 06:09 GMT

 Anant Ambani: దిగ్గజ వ్యాపారవేత, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీకి వాచ్ అంటే చాలా ఇష్టం. ఆయన ధరించే వాచ్ లు ధర తెలిస్తే మీరు షాక్ అవుతారు. అనంత్ అంబానీ విలువైన రిచర్డ్ మిల్లీ ఆర్ఎం 52- 04 స్కల్ బ్లూ సఫైర్ వాచ్ ను ధరించారు. ఈ అరుదైన టైం పీస్ కేవలం ప్రపంచంలో మూడు మాత్రమే ఉన్నాయట. దాని స్పెషాలిటీ ఏమిటి ? ఆ వాచ్ ధర ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం

Anant Ambani: ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీకి గడియారాలు అంటే చాలా ఇష్టమట. ఆయన తన పెళ్లిలో కూడా కోట్ల విలువైన గడియారాలను బహుమతిగా అందించారు. ముఖేష్ అంబానీ నీతా అంబానీల ముద్దుల కుమారుడు అనంత్ అంబానీ ఓ హోరాలజిస్ట్ . అంటే వాచ్లను చాలా ఇష్టంతో స్వీకరించే వాళ్ళు అని దీని అర్థం. ఇప్పుడు అతను పెట్టుకున్న ఒక వాచ్ ప్రపంచాన్ని ఆకర్షించింది

అనంత అంబానీ రిచర్డ్ మిల్లే, పాటెక్ ఫిలిప్, ఔడెమర్స్ పిగ్యూట్ వంటి లగ్జరీ బ్రాండ్లకు చెందిన వాచ్లను ధరిస్తుంటాడు ఇటీవల రాధిక మర్చంట్ తో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఆయన ఆర్ఎం 52-04 అనే వాచ్ ను చేతికి ధరించాడు. ఇది ప్రపంచంలోనే అరుదైన వాచ్ లో ఒకటి అట.

ప్రపంచంలోనే అరుదైన టైం పీస్ లలో రిచర్డ్ మిల్లే ఆర్ఎం 52-04 స్కల్ బ్లై సఫైర్ వాచ్ ఒకటి. ది ఇండియన్ హోరాలజీ అనే ఇన్స్టాగ్రామ్ పేజీ ప్రకారం ఈ వాచ్ కేవలం ప్రపంచంలో మూడు పీసులు మాత్రమే ఉన్నాయని పేర్కొంది. వాటిలో ఒకటి అనంత్ అంబానీ దగ్గర ఉంటే వింటేజ్ అనే లగ్జరీ గడియారం దుకాణం చెబుతున్న ప్రకారం మీ జీవితకాలంలో వీటిని చూడడం మీఅదృష్టమని తమ ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు. ఈ వాచ్ కూడా చూసేందుకు చాలా అందంగా ఉంది.


రిచర్డ్ మిల్లె ఆర్ఎం 52-04 ఒకే నీలమణితో డిజైన్ చేశారు. ఈ వాచ్ మధ్యలో పిరెట్ పుర్రె బొమ్మ కూడా ఉంటుంది. ఈ బొమ్మపై క్రాస్ బోన్ల డిజైన్ ఉంటుంది. ఇండియన్ హోరాలజీ ప్రకారం పుర్రె వెనుక భాగం మధ్య వంతెనగా క్రాస్ బోన్లు వంటివి లోపల ఆ వాచ్ సులువుగా కదిలే విధంగా ఉంటుంది

రిచుడ్మిలే ఆర్ ఎం ఫిఫ్టీ టు జీరో ఫోర్ స్కల్ప్ బ్లూ సైఫర్ వాచ్ విలువ 2,625,00 డాలర్లు. అంటే సుమారు ూ. 22,51,90,481 లేదా 22 కోట్లు అట. దీని ధర తెలిస్తే ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే

అధిక ధరలతో ప్రత్యేకమైన డిజైన్లు తయారు చేసే ప్రసిద్ధి చెందిన స్వీస్ వాష్ మేకింగ్ బ్రాండ్ కంపెనీ రిజర్వ్ ఇది సంపన్నుల కోసం మాత్రమే తయారు చేస్తుంది. వీటిని కేవలం ఒకటి లేదా రెండు వాచులను మాత్రమే తయారు చేస్తుంటారు. అది రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఆయన భార్య నీతా చిన్న కుమారుడు అనంత అంబానీ తన వివాహ వేడుకలో ధరించాడు. రాధిక మార్చెంట్ ను అనంత్ అంబానీ 2024 జులై 12న వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. 

Tags:    

Similar News