Gold Rate Today: బంగారం కొనేవారికి భారీ షాక్.. రెండో రోజూ పెరిగిన పసిడి ధరలు
Gold Rate Today: బంగారం కొనుగోలు చేసేవారికి వారికి భారీ షాకింగ్ న్యూస్. ఈ కొత్త ఏడాదిలో స్థిరంగా కొనసాగుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు భారీగా పెరుగుదల నమోదు చేస్తున్నాయి. క్రితం రోజుతో పోల్చితే నేడు తులం బంగారం ధర భారీగానే పెరిగిందని చెప్పవచ్చు. అయితే వెండి ధరలు మాత్రం స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఈక్రమంలో నేడు జనవరి 10వ తేదీ శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
తాజా ధరలు 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 80,300 పలుకుతుండగా..22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72, 610 రూపాయలు ఉంది. బంగారం ధరలు గడిచిన వారం రోజులుగా పెరుగుతూనే ఉణ్నాయి. అయితే ఇప్పుడు రూ. 80వేల మార్క్ దాటింది. ఈ ధరలు పెరగడానికి అంతర్జాతీయంగా నెలకున్న పరిస్థితులతోపాటు దేశీయంగా కూడా భారీ డిమాండ్ పెరగడం కూడా ఓ కారణంగా చెప్పవచ్చు.
బంగారం ధరలు భవిష్యత్తులో పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి గల కారణాలు చెబుతూ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి అమెరికా సహా పలు దేశాల్లో సంక్షోభం దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో పెట్టుబడి దారులు తమ పెట్టుబడులను బంగారం వైపు తరలించే ఛాన్స్ ఉంటుంది. దీంతో బంగారానికి డిమాండ్ పెరిగి రికార్డు ధర దిశగా అడుగులు వేస్తోంది.