PM Kisan: మీకు తెలుసా.. పెళ్లి కాని రైతులకు పీఎం కిసాన్ డబ్బులు వస్తాయా.. ఈ ప్రభుత్వ రూల్స్ ఏంటి..?

PM Kisan Yojana: దేశవ్యాప్తంగా రైతులకు పెట్టుబడి సాయంగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనే పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2024-11-20 10:54 GMT

PM Kisan: మీకు తెలుసా.. పెళ్లి కాని రైతులకు పీఎం కిసాన్ డబ్బులు వస్తాయా.. ఈ ప్రభుత్వ రూల్స్ ఏంటి..?

PM Kisan Yojana: దేశవ్యాప్తంగా రైతులకు పెట్టుబడి సాయంగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనే పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అర్హులైన రైతులకు ఏటా రూ.6వేలు అందజేస్తున్నారు. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి కేంద్రం రైతుల ఖాతాల్లో 2వేలు జమ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా 19వ విడత పీఎం కిసాన్ సొమ్మును విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పీఎం కిసాన్ నిధులను పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈ-కేవైసీ, ల్యాండ్ వెరిఫికేషన్, ఆధార్ లింకింగ్ తదితరాలను పూర్తిచేయాలి.

ప్రభుత్వ పథకాల్లో అతి ముఖ్యమైనటువంటి పీఎం కిసాన్ యోజనకి సంబంధించి కీలక విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రభుత్వ పథకాల ద్వారా దేశంలోని పౌరులకు లబ్ధి చేకూరుస్తున్నాయి. అన్ని వర్గాల వారికి ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందజేస్తుంది. సాధారణంగా మన దేశంలో 50శాతం కంటే ఎక్కువ జనాభా వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్నారు. అందుకే ప్రభుత్వాలు రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాయి. రైతుల ఆర్థిక పరిస్థితి బాగుండేలా చూసుకుంటూ పలు కీలక పథకాలు అమలు చేస్తున్నాయి. అందులో ఒకటే పీఎం కిసాన్ యోజన.

భారత ప్రభుత్వం 2019లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని అమల్లోకి తెచ్చింది. దేశంలోని తక్కువ ఆదాయం కలిగిన రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడం ఈ స్కీం ముఖ్య ఉద్దేశం. ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం కొన్ని నిబంధనలను కూడా ఖరారు చేసింది. వాటి ఆధారంగా మాత్రమే రైతులకు ప్రయోజనాలను కల్పిస్తారు. ఈ పథకం ద్వారా నగదు లబ్ది పొందాలంటే రైతు పెళ్లి చేసుకున్నాడా? అవివాహితా అన్నది ముఖ్యం కాదు. పిఎం కిసాన్ పథకం కింద, వారి పేరు మీద భూమి ఉంటే ఆయా రైతులకు ప్రయోజనాలు లభిస్తాయి.

ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే వారికి దాని ప్రయోజనాలు కల్పిస్తుంది ప్రభుత్వం. ఈ పథకం కింద, 2 హెక్టార్ల వరకు భూమి ఉన్న సన్నకారు రైతులకు డబ్బులను వాటి ఖాతాల్లో జమ చేస్తుంది. ఇటీవలనే పీఎం కిసాన్ 18వ విడత నిధులు కూడా రిలీజ్ చేశారు ప్రధాని మోదీ. 05 అక్టోబర్ 2024న రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బు జమ అయింది. పంట సాయంగా రూ. 2 వేలు రైతుల అకౌంట్లలో వేశారు. తాజాగా పీఎం కిసాన్ 19వ విడతపై కీలక అప్డేట్ బయటకొచ్చింది. 19వ విడత నిధులు కూడా విడుదల చేసేందుకు కేంద్రం న్నాహాలు చేస్తోంది. ఏ మాత్రం ఆలస్యం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకంటోంది. 19వ విడుత నిధులను 2025 ఫిబ్రవరి చివరి వారంలో విడుదల చేయనున్నట్లు సమాచారం.

Tags:    

Similar News