PM Kisan: పీఎం కిసాన్ యోజనలో మీ పేరు లేకపోతే.. వెంటనే ఇలా చేయండి..!
ఆన్‌లైన్‌లో ఈ పథకంలో చేరేందుకు కూడా అవకాశం ఉంది. దీని కోసం, ముందుగా మీరు అధికారిక పీఎం కిసాన్ వెబ్‌సైట్ https://pmkisan.gov.inకి వెళ్లాలి.
PM Kisan Yojana Applying Process : ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీని కింద దేశ వ్యాప్తంగా కోట్లాది మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. పంట పెట్టుబడి సాయంగా ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్న పథకమే ఈ ప్రధాన మంత్రి కిసాన్ యోజన. ఈ పథకం 2018లో ప్రారంభించబడింది. ఈ పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులైన రైతులకు పంటల సాగు సహాయం కింద ఏటా రూ.6వేలు అందజేస్తున్నారు.
ఇలా ఒకేసారి ఇవ్వరు.. నాలుగు నెలలకోసారి మూడు విడతలుగా రూ.2 వేలు చొప్పున డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) కింద ఈ సొమ్ము నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది ప్రభుత్వం. ఇప్పటివరకు ఎవరైనా ఈ పథకంలో చేరకపోతే వారు ఈ పథకంలో చేరవచ్చు. తద్వారా వారు తదుపరి 19వ విడత కింద రూ.2 వేలు పొందవచ్చు.
ఆన్‌లైన్‌లో ఈ పథకంలో చేరేందుకు కూడా అవకాశం ఉంది. దీని కోసం, ముందుగా మీరు అధికారిక పీఎం కిసాన్ వెబ్‌సైట్ https://pmkisan.gov.inకి వెళ్లాలి. వెబ్‌సైట్‌కి వెళ్లిన తర్వాత, కుడివైపు ఎగువన కొత్త రైతు రిజిస్ట్రేషన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. అక్కడ మీరు మీ పేరు, మొబైల్ నంబర్, ఆధార్ కార్డ్, రాష్ట్రం మొదలైన మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి. మీరు క్యాప్చా కోడ్‌ను కూడా నమోదు చేసి, సెండ్ OTPపై క్లిక్ చేయాలి. మీ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. ఆ తర్వాత ఓటీపీని నమోదు చేయాలి.
ఆ తర్వాత ఆధార్ నంబర్ నుంచి రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామం వంటి వివరాలను రిజిస్ట్రేషన్ ఫారంలో నమోదు చేయాలి. ఆ తర్వాత బ్యాంకు ఖాతా నంబరు, IFSC కోడ్‌తో సహా మీ భూమి వివరాలను నమోదు చేయాలి. మీరు అవసరమైన పత్రాలను కూడా అప్‌లోడ్ చేయాలి. ఇందులో ఆధార్ కార్డు, ఇతర భూమికి సంబంధించిన పత్రాలను యాడ్ చేయాలి. చివరకు సబ్మిట్ చేయాలి... దీంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
పీఎం కిసాన్ పథకం కింద ఇప్పటి వరకు 18విడుతల డబ్బులు రైతుల అకౌంట్లలో పడ్డాయి. ఇప్పుడు రైతులు.. 19వ విడత కోసం ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. ఇటీవల అక్టోబరు నెలలో డబ్బులు రాగా.. తదుపరి విడత వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నా ఆ వాయిదా కింద రూ.2 వేలు అకౌంట్లో పడుతాయి. ఇప్పుడు, మీరు ఖచ్చితంగా KYC చేస్తేనే మీకు డబ్బు వస్తుంది.
ఇది 3 విధాలుగా చేయవచ్చు. మీరు పీఎం కిసాన్ పోర్టల్ లేదా యాప్ ద్వారా OTP ఆధారిత e-KYC చేయవచ్చు. మీరు సాధారణ సేవా కేంద్రాలలో బయోమెట్రిక్ ఆధారిత e-KYC చేయవచ్చు. మీరు పీఎం కిసాన్ యాప్ ద్వారా బయోమెట్రిక్ ఆధారిత KYC చేయవచ్చు. మీరు ఇంకా దరఖాస్తు చేయకుంటే వీలైనంత త్వరగా ప్రక్రియను పూర్తి చేసి, పథకం కింద అందుబాటులో ఉన్న సహాయాన్ని పొందండి.