Business Idea: టమాటోతో సూపర్‌ బిజినెస్‌.. ఇలా చేస్తే భారీగా లాభాలు..!

Business Idea: ప్రస్తుతం వ్యాపారాల్లో పోటీ బాగా పెరిగిపోయింది. ఒకరు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టగానే ఇతరులు కాంపిటేషన్‌గా బిజినెస్‌ చేస్తున్నారు.

Update: 2024-11-22 12:58 GMT

Business Idea: టమాటోతో సూపర్‌ బిజినెస్‌.. ఇలా చేస్తే భారీగా లాభాలు..!

Business Idea: ప్రస్తుతం వ్యాపారాల్లో పోటీ బాగా పెరిగిపోయింది. ఒకరు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టగానే ఇతరులు కాంపిటేషన్‌గా బిజినెస్‌ చేస్తున్నారు. దీంతో పెరిగిన పోటీకి అనుగుణంగా కొంగొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. నిజానికి ఇలా కొత్త మార్గాలను వెతుక్కుంటేనే పోటీని తట్టుకొని మార్కెట్లో నిలబడగలుతాం. అలాంటి ఒక ఇన్నోవేటివ్‌ బిజినెస్‌ ఐడియాల్లో ఒకదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

టమాటలకు నిత్యం డిమాండ్‌ ఉంటుందనే విషయం తెలిసిందే. టమాట లేకుండా వంటలు ఊహించుకోవడం కూడా కష్టం. ఇక టమాటల ధరలు కూడా ఎప్పుడూ ఒకలా ఉండదు. ఒక్కోసారి ఉన్నపలంగా ధరలు ఆకాశాన్ని అంటుతాయి. మరికొన్ని సందర్భాల్లో నేల చూపులు చూస్తాయి. అందుకే టమాట పౌడర్‌కు ప్రస్తుతం బాగా డిమాండ్‌ పెరుగుతోంది. టమాట పౌడర్‌ సూపర్ మార్కెట్లతో పాటు చిన్న చిన్న కిరాణం దుకాణాల్లో కూడా అందుబాటులో ఉంటున్నాయి.

ఈ టమాటో పౌడర్‌ తయారీ వ్యాపారాన్ని ప్రారంభిస్తే మంచి లాభాలను ఆర్జించవచ్చు. టమాట పౌడర్‌ను హోటల్స్‌, రెస్టారెంట్స్‌లతో పాటు ఇళ్లలో కూడా ఉపయోగిస్తున్నారు. టమాట పౌడర్‌ తయారీకి పెద్దగా పెట్టుబడి కూడా అసవరం లేదు. తక్కువ మొత్తంలోనే ఇంట్లోనే ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టొచ్చు. ఇందుకోసం ముందుగా పెద్ద ఎత్తున టమాటలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

అనంతరం టమాటలను శుభ్రం కడుక్కోవాలి. తర్వాత టమాటను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఎండలో బాగా ఆరబెట్టాలి. ఇలా పూర్తిగా ఆరిన తర్వాత టమాట ముక్కలను మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవాలి. వీటిని కవర్స్‌ లేదా డబ్బాల్లో ప్యాకింగ్ చేసి విక్రయించుకోవచ్చు. ఆన్‌లైన్‌ వేదికగా కూడా వీటికి అమ్ముకోవచ్చు. మార్కెట్లో కిలో టమాట పౌడర్‌ ధర రూ. 150 వరకు అందుబాటులో ఉన్నాయి. హోల్‌సేల్‌లో టమాట పౌడర్‌ను రూ. 100కి విక్రయించుకోవచచు. మీ వ్యాపారం పెరిగే కొద్దీ.. పెద్దపెద్ద మిషిన్స్‌ను కొనుగోలు చేసి పెద్ద ఎత్తున వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.

Tags:    

Similar News