Indiramma Housing Scheme: పేద ప్రజలకు సర్కార్ తీపికబురు..ఈ నెలాఖరు నుంచే ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ..పూర్తి వివరాలివే

Indiramma Housing Scheme: పేద ప్రజలకు శుభవార్త చెప్పేందుకు రెడీ అవుతోంది తెలంగాణ సర్కార్.

Update: 2024-11-22 04:53 GMT

Indiramma Housing Scheme

Indiramma Housing Scheme: పేద ప్రజలకు శుభవార్త చెప్పేందుకు రెడీ అవుతోంది తెలంగాణ సర్కార్. ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల మొదటి విడత ఎంపిక ప్రక్రియను ఈ నెల చివరి వారంలో షురూ చేసేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. ఈ నెలాఖరున వీలుకాకపోతే డిసెంబర్ మొదటి వారంలో నైనా జాబితా సిద్ధం చేసేందుకు అడుగులు వేస్తోంది. నిజానికి ఈనెల 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు గ్రామసభలు ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల తొలి జాబితాను ఖరారు చేస్తామని ప్రభుత్వం తెలిపింది.

అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని నిబంధనలపై స్పష్టత రాకపోవడం, కేంద్రం యాప్ లోని అంశాలు రాష్ట్ర ప్రభుత్వ యాప్ తో సరిపోలకపోవడంతో గ్రామసభల ఏర్పాటు ప్రక్రియలు ముందుకు కదలలేదు. ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రానికి కేంద్రం వాటా అందాలంటే ఈ రూల్స్ పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రాష్ట్రంలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే కూడా ఈ నెలాఖరులో పూర్తయ్యే అవకాశం ఉంది. తర్వాతే లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

కాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలో ఇళ్ల కోసం 80, 54,554 దరఖాస్తులు అందాయి. దీనిలో గతంలో ఇంటి లబ్దిపొందిన కుటుంబాలు 12,72,019 ఉన్నాయని అధికారులు తెలిపారు. లబ్దిదారుల ఎంపికకు ఫుడ్ సెక్యూరిటీ కార్డును ప్రామాణికంగా తీసుకోమని..గ్రామ సభల ద్వారానే ఎంపిక చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

లబ్దిదారుల ఎంపికలో కీలక పాత్ర పోషించే ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు ఇప్పటికే పూర్తయ్యింది. కేంద్రం సాఫ్ట్ వేర్ గ్రామపంచాయతీ కార్యదర్శుల వివరాలను నమోదు చేసింది. వీరి ద్వారానే లబ్దిదారుల వివరాలను కేంద్రం వెబ్ సైట్లో నమోదు చేయడానికి అవకాశం ఉంటుంది.

స్థలం ఉన్నవారికే మొదటి దశలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని సర్కార్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణానికి తగ్గకుండా లబ్దిదారుడు ఇంటిని నిర్మించుకోవాల్సి ఉంటుంది. దీనికి సర్కార్ నాలుగు దశల్లో రూ. 5లక్షల చెల్లిస్తూన్న సంగతి తెలిసిందే

Tags:    

Similar News