Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం ధర.. పసిడి ప్రియులకు చుక్కలే..తులం ఎంత పెరిగిందంటే?
Gold Rate Today: బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. గత వారం రోజులుగా పెరుగుతూ వస్తున్నాయి. తులం బంగారం ధర ఇప్పుడు 3వేలకు పైగానే పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతుండటం దీనికి కారణం. అయితే వెండి రేట్లు మాత్రం కాస్త ఊరట కలిగిస్తున్నాయని చెప్పవచ్చు. ఈ క్రమంలో నవంబర్ 24వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో తులం బంగారం ధర ఎంత పెరిగిందో ఇప్పుడు చూద్దాం.
బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా పసిడి ధరలకు రెక్కలు వచ్చాయి. గత వారం రోజుల్లోనే తులం బంగారం ధర రూ. 3వేలకు పైగా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వరసగా వారం రోజుల నుంచి పెరిగాయి. నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులంపై రూ. 750మేర పెరిగింది. దీంతో పది గ్రాముల బంగారం ధర రూ. 73వేల మార్క్ తాకింది. ఇక 24క్యారెట్ల బంగారం ధర నేడు తులంపై రూ. 820 వరకు పెరిగింది. దీంతో తులం బంగారం ధర రూ. 79వేల 640దగ్గరకు ఎగబాకింది. గత వారం రోజుల్లో 24క్యారెట్ల బంగారం ధర తులానికి రూ. 4వేల మేర పెరిగింది.
బంగారం ధర భారీగా పెరుగుతూ పసిడి ప్రియులను ఆందోళనకు గురిచేస్తున్న సమయంలో వెండి కాస్త ఊరట కల్పిస్తుంది. వరుస సెషన్లలో ఎలాంటి మార్పులు లేకుండా స్థిరంగానే కొనసాగుతోంది. గత వారం రోజుల నుంచి కిలో వెండి ధర రూ. 1,01,000 మార్క్ దగ్గర ట్రెండింగ్ అవుతోంది. నేడు కూడా ఎలాంటి మార్పులు లేదు. కిలో వెండి ధర రూ. 1.01 లక్షల వద్ద ఉంది. అయితే పైన పేర్కొన్న బంగారం, వెండి ధరల్లో జీఎస్టీ, సెస్ వంటి పన్నులు కలపలేదు. ట్యాక్సులు కలిపితే ధరలు ఇంకొంచెం ఎక్కువే ఉంటాయి. కొనుగోలు చేసే ముందే స్థానిక జ్యువెల్లర్స్ దగ్గర ధరలు తెలుసుకోవడం మంచిది.