EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి బిగ్ అలర్ట్..యాక్టివ్ UAN లేకుంటే ఆ సేవలు బంద్

Update: 2024-11-22 04:00 GMT

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉన్న ఉద్యోగులకు బిగ్ అలర్ట్. యాక్టివ్ యూఏఎన్ లేకుంటే మీ ఆ సేవలన్నీ నిలిచిపోనున్నాయి. మీరు ఎలాంటి సమాచారం కూడా పొందలేరు. ఈ మేరకు ఈమధ్యే ఎంప్లాయిస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ఓ ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 1, 2024 నుంచి యూనివర్సల్ అకౌంట్ నెంబర్ విడుదల చేసింది. ఒక్కో ఉద్యోగికి ప్రత్యేక నెంబర్ ను కేటాయిస్తుంది. పీఎఫ్ అకౌంట్లన్నీ ఈ యూఏఎన్ నెంబర్ కిందే ఉంటాయి. సెప్టెంబర్ 2024 కు సంబంధించిన అధికారిక పేరోల్ గణాంకాలను ఈమధ్యే రిలీజ్ చేసింది. దాని ప్రకారం సెప్టెంబర్ నెలలో 18, 81 లక్షల మంది పీఎఫ్ ఖాతాదారులు పెరిగారు. ప్రతి సభ్యునికి ఒకే శాశ్వత యూఏఎన్ నెంబర్ కేటాయిస్తారు. ఇది అతని ఉద్యోగ జీవిత కాలంలో ప్రయోజనాలను పొందేందుకు సహాయపడుతుంది.

అయితే ఈపీఎఫ్ఓ కీలక ప్రకటన వెలువరించింది. యూఏన్ యాక్టివ్ లేనట్లయితే వారికి ఆన్ లైన్ సర్వీసులు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. ఈపీఎఫ్ఓ యూనిఫైడ్ పోర్టల్ ప్రకారం కంపెనీ యాజమాన్యాలకు, ఈపీఎఫ్ఓ ఆన్ లైన్ సర్వీసులు పొందేందుకు ఉద్యోగులు యూఏఎన్ యాక్టివేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఉద్యోగులుందరికీ ఆధార్ ఆధారిత ఓటీపీ ద్వారా యాక్టివేషన్ చేసేలా చేయండని ఈపీఎఫ్ఓ కంపెనీ యాజమాన్యాలకు సూచించింది.

ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూర్ నవంబర్ 12,2024 రోజు తెలిపిన వివరాల ప్రకారం కంపెనీలు తమ సంస్థల్లో చేరిన ఉద్యోగులందరికీ నవంబర్ 30, 2024లోపు ఆధార్ ఆధారిత ఓటీపీ ద్వారా యూఏఎన్ యాక్టివేషన్ చేయాలి. కొత్తగా చేరిన వారితో ఈ ప్రక్రియ ప్రారంభించాలి. ఇఖ రెండో దశలో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా బయోమెట్రిక్ అథెంటికేషన్ చేయించాలి. అంటే ఉద్యోగులు తప్పకుండా యూఏఎన్ యాక్టివేట్ చేయాల్సిందే. ఇలా చేసుకున్నవారికి మాత్రమే ఈపీఎఫ్ఓ సేవలు ఆన్ లైన్ ద్వారా అందుతాయి.

యూఏఎన్ ఎలా యాక్టివేట్ చేయాలి?

* ఈపీఎఫ్ మెంబర్ పోర్టల్ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterfaceలోకి వెళ్లాలి.

* అందులో యాక్టివేట్ యూఏఎన్‌పై క్లిక్ చేయాలి.

*అందులో కనిపించే ఆప్షన్లలో యూఏఎన్, మెంబర్ ఐడీ, ఆధార్ లేదా పాన్ సెలెక్ట్ చేసుకోవాలి.

* పేరు, డెట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ ఇచ్చి గెట్ ఆథరైజేషన్ పిన్ పై క్లిక్ చేయండి.

*మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి పిన్ వస్తుంది. పిన్ ఎంటర్ చేసి వాలిడెట్ ఓటీపీ, యాక్టివేట్ యూఏఎన్‌పై క్లిక్ చేయండి.

*యూఏఎన్ యాక్టివేట్ అయి మీ ఫోన్‌కు పాస్‌వర్డ్ వస్తుంది.

* యూఏఎన్, పాస్‌వర్డ్ ద్వారా మెంబర్ పోర్టల్‌లోకి లాగిన్ కావచ్చు. 

Tags:    

Similar News