Jeevan Tarun: రోజుకు రూ. 171 కడితే చాలు ..ఒకే సారి రూ. 28లక్షలు..ఎల్ఐసీ నుంచి అద్బుతమైన ప్లాన్ ఇదే
Jeevan Tarun: తక్కువ పెట్టుబడితో మంచి రాబడి కోరుకునేవారికి పెట్టుబడి మార్గాలెన్నో ఉన్నాయి. అందులో బీమా రక్షణతోపాటు పొదుపు అవకాశం కల్పించే అద్భుతమైన స్కీములు అందిస్తోంది ఎల్ఐసీ. ఎల్ఐసీ జీవన్ తరుణ్ ప్లాన్ తో రోజుకు రూ. 171 పొదుపు చేస్తూ ఒకేసారి రూ. 28లక్షలను పొందవచ్చు. ఎలాగో ఇప్పుడు చూద్దాం.
సామాన్య, మధ్య తరగతి ప్రజల్లో ఎక్కువగా కోరుకునేది తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయం కోసం చాలా పెట్టుబడి స్కీములు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అందించే సంప్రదాయ పొదుపు పథకాలే ఇందుకు చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు. అయితే బీమారక్షణతోపాటు మీ పొదుపు లక్ష్యాన్ని నెరవేర్చుకునే మరో అవకాశం కూడా ఉంది. ఎల్ఐసీ ఇలాంటి బీమా ప్లస్ పొదుపు స్కీములను కూడా అందిస్తోంది. అందులో ఒకటి ఎల్ఐసీ జీవన్ తరుణ్ ప్లాన్. దీనిలో తక్కువ మొత్తంలో పొదుపు చేస్తూనే లక్షల రూపాయల మెచ్యూరిటీ సొమ్మును అందుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు చూద్దాం.
ఎల్ఐసీ జీవన్ తరుణ్ ప్లాన్ పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఒక అద్భుతమైన బీమా పాలసీ అని చెప్పవచ్చు. ఇదొక మనీ బ్యాక్ పాలసీ. భవిష్యత్తు అవసరాలు, పిల్లల ఉన్నత చదువులు, వివాహాలు వంటి వాటికి ఆర్థికంగా అండగా ఉంటుంది. ఇది నాన్ లింక్డ్ పాలసీ. దీంతో స్టాక్ మార్కెట్ ఒడుదొడుకులకు ఎలాంటి సంబంధం ఉండదు. ఎల్ఐసీకి వచ్చే లాభాల్లోనూ ఈ పాలసీ తీసుకుంటే బోనస్ అందుతుంది. ఇది ఒక లిమిటెడ్ ప్రీమియం పేమెంట్స్ పాలసీ. మెచ్యూరిటీ టెన్యూర్ కంటే ఐదేళ్లు తక్కువగానే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ 3 నెలల నుంచి 12ఏళ్ల వయస్సు గత పిల్లల పేరుపై కొనుగోలు చేయవచ్చు. కనీసం సమ్ అష్యూర్డ్ రూ. 75వేలు ఉంటుంది. గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. మెచ్యూరిటీ కాల వ్యవధి 20 సంవత్సరాలు ఉంటుంది. అంటే మీరు 20ఏళ్ల వరకు ప్రీమియం కడితే బీమా కవరేజీ 25ఏళ్ల వరకు కొనసాగుతుంది.
ఈ పాలసీ కొనుగోలు చేసేటప్పుడు మీ పిల్లల వయస్సు ఏడాది లోపు ఉంటుందనుకుంటే మీ పాలసీ టర్మ్ 24ఏళ్లు ఉంటుంది. అప్పుడు మీరు 19ఏళ్ల పాటు ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. మీరు రూ. 10లక్షల సమ్ అష్యూర్డ్ ఉండే పాలసీ తీసుకుంటే..అప్పుడు మీరు నెలకు రూ. 3, 832 వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అంటే రోజుకు రూ. 130 కట్టాలి. ఒకేసారి రూ. 28లక్షలు రావాలనుకుంటే మీరు రోజుకు రూ. 171 ప్రీమియం చెల్లించేలా పాలసీని తీసుకోవాలి. మీ బాబు వయస్సు 2ఏళ్లప్పుడు పాలసీ తీసుకుంటే అప్పుడు 23ఏళ్లు వచ్చే వరకు పాలసీ ఉంటుంది. 18ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. రూ. 10లక్షలు తీసుకుంటే మీరు రోజుకు రూ. 171 కట్టాల్సి ఉంటుంది. మీ పెట్టుబడి మొత్తం రూ. 10.89 లక్షలు ఉంటుంది. మీ బాబుకు 25ఏళ్లు వచ్చిన తర్వాత చేతికి రూ. 28, 24లక్షలు అందుతాయి.