Gold And Silver Prices Today: బంగారం ప్రియులకు మరోసారి షాక్..మళ్లీ పెరిగిన బంగారం ధరలు
Gold And Silver Prices Today: బంగారం ధరలకు మళ్లీ రెక్కలు వచ్చాయి. గత వారం తగ్గిన ఈ ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. అయితే ఈ ధరలు ఎంత పెరిగాయి..ఏ నగరాల్లో ఎంతెంత పెరిగాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Gold And Silver Prices Today: దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాస్త తగ్గిన బంగారం ధర ఇప్పుడు మళ్లీ పుంజుకుంటుంది. గత 5 రోజులుగా క్రమంగా పెరుగుతూనే వస్తుంది. భవిష్యత్తులో బంగారం ధర భారీగా తగ్గుతుందని ఆశించిన పసిడి ప్రియులకు నిరాశే ఎదురయ్యింది. ఈ పెరుగుతున్న ధరలను బట్టి చూసినట్లయితే వచ్చే వారం బంగారం ధర రూ. 80వేల స్థాయికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది. ఈరోజు నవంబర్ 23న బంగారం ధర దాదాపు రూ. 79వేలకు స్థాయికి చేరుకోవడంతో బంగారం ప్రియుల్లో మరింత ఆందోళన నెలకొంది.
నేడు శనివారం హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 870 పెరిగింది. ఈ క్రమంలోనే 24క్యారెట్ల బంగారం ధర రూ. 78, 830కి చేరుకుంది. 22క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 72,260కి చేరుకుంది. ఢిల్లీలో 24క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 78,980 ఉండగా..22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ. 72,410కి ఉంది. వెండి ధరలు మాత్రం కేజీకి వంద రూపాయలు తగ్గింది.
దేశంలో ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లు:
ఢిల్లీలో రూ. 78,980, రూ. 72,410
హైదరాబాద్‌లో రూ. 78,830, రూ. 72,260
విజయవాడలో రూ. 78,830, రూ. 72,260
వడోదరలో రూ. 78,880, రూ. 72,310
చెన్నైలో రూ. 78,830, రూ. 72,260
ముంబైలో రూ. 78,830, రూ. 72,260
కోల్‌కతాలో రూ. 78,830, రూ. 72,260
బెంగళూరులో రూ. 78,830, రూ. 72,260
పూణేలో రూ. 78,830, రూ. 72,260
కేరళలో రూ. 78,830, రూ. 72,260
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)
అహ్మదాబాద్‌లో రూ. 91,900
ఢిల్లీలో రూ. 91,900
హైదరాబాద్‌లో రూ. 100,900
విజయవాడలో రూ. 100,900
బెంగళూరులో రూ. 91,900
ముంబైలో రూ. 91,900
కేరళలో రూ. 100,900
చెన్నైలో రూ. 100,900
భువనేశ్వర్‌లో రూ. 100,900
వడోదరలో రూ. 91,900
కోల్‌కతాలో రూ. 91,900