Saving Scheme: మీ దగ్గర డబ్బులున్నాయా.. ఎఫ్‌డీ కంటే ఎక్కువ రిటర్న్స్‌ పొందాలని చూస్తున్నారా?

Saving Scheme: పెద్ద మొత్తంలో డబ్బులు ఉంటే ఎక్కడో ఒక చోట పెట్టుబడి పెట్టాలని భావిస్తుంటారు.

Update: 2024-11-21 06:23 GMT

Saving Scheme: మీ దగ్గర డబ్బులున్నాయా.. ఎఫ్‌డీ కంటే ఎక్కువ రిటర్న్స్‌ పొందాలని చూస్తున్నారా?

Saving Scheme: పెద్ద మొత్తంలో డబ్బులు ఉంటే ఎక్కడో ఒక చోట పెట్టుబడి పెట్టాలని భావిస్తుంటారు. ఇందు కోసం ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. కొందరు బంగారంలో పెట్టుబడి పెడితే మరికొందరు భూములు కొనుగోలు చేస్తుంటారు. అయితే ఎలాంటి రిస్క్‌ లేకుండా మంచి రిటర్న్స్‌ వచ్చే వాటిలో బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌ బెస్ట్‌ ఆప్షన్‌ అని చాలా మంది భావిస్తుంటారు. బ్యాంకుల్లో ఉంటే సొమ్ము భద్రంగా ఉంటుందని అనుకుంటారు. రిటర్న్స్‌ అధికంగా రాకపోయినా పర్లేదు డబ్బు సేఫ్‌గా ఉంటుందని ధీమాతో ఉంటారు. అయితే బ్యాంకుల్లో ఎఫ్‌డీ కంటే పోస్టాఫీస్‌లో ఎక్కువగా రిటర్న్స్‌ వచ్చే పథకాలు ఉన్నాయని మీకు తెలుసా.? ఇంతకీ పోస్టాఫీస్‌లో ఉన్న బెస్ట్‌ సేవింగ్ స్కీమ్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

* పోస్టాఫీస్‌లో అందుబాటులో ఉన్న బెస్ట్‌ సేవింగ్‌ స్కీమ్స్‌లో సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్ స్కీమ్‌ ఒకటి. ఈ పథకంలో 60 ఏళ్లు పైబడిన వారికి ప్రయోజనం లభిస్తోంది. ఈ పథకంలో ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ పథకంలో గరిష్టంగా రూ. 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్‌కు 8.2 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ స్కీమ్‌ గడువు 5 ఏళ్లు ఉంటుంది. మరో మూడేళ్లు పొడగించుకోవచ్చు.

* మంచి పొదుపు పథకాల్లో మహిళా సమ్మాన్ పొదుపు సర్టిఫికెట్ ఒకటి. ఇది కేవలం మహిళల కోసమే తీసుకొచ్చారు. అయితే ఈ పథకం కేవలం రెండేళ్లు మాత్రమే ఉంటుంది. ఈ పథకంలో పెట్టుబడి పెడితే 7.5 శాతం వడ్డీ లభిస్తుంది.

* నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌ స్కీమ్‌ పథకం గడువు ఐదేళ్లు ఉంటుంది. ఈ పథకంలో కనీసం రూ. 1000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇందులో పెట్టుబడి పెట్టే వారికి 7.7 శాతం వార్షిక వడ్డీ రేటు లభిస్తుంది.

* పోస్టాఫీస్‌ అందించే మంథ్లీ ఇన్వెస్టింగ్ స్కీమ్‌ కూడా బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇందులో ఏడాదికి కనీసం రూ. 1500 చొప్పున పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇందులో గరిష్టంగా రూ. 9 లక్షల వరకు డిపాజిట్‌ చేసుకోవచ్చు. 7.4 శాతం వడ్డీ లభిస్తుంది. ఐదేళ్ల గడువు ఉన్న ఈ స్కీమ్‌ను పొడిగించుకోవచ్చు.

* కిసాన్‌ వికాస్‌ పత్ర సేవింగ్‌ స్కీమ్‌లో ఎలాంటి పరిమితి లేకుండా పొదుపు చేసుకోవచ్చు. ఈ పథకం గడువు 115 నెలలుగా ఉంటుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన వారికి 7.5 శాతం వడ్డీ రేటు లభిస్తుంది.

Tags:    

Similar News