LIC: రోజు రూ. 45తో రూ. 25 లక్షలు పొందొచ్చు.. బెస్ట్‌ పాలసీ.. !

LIC: ప్రస్తుతం ప్రతీ ఒక్కరిలో ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతోంది. దీంతో ఓవైపు డబ్బులు పొదుపు చేస్తూనే మరోవైపు హెల్త్‌, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలను తీసుకుంటున్నారు.

Update: 2024-11-29 11:38 GMT

LIC: రోజు రూ. 45తో రూ. 25 లక్షలు పొందొచ్చు.. బెస్ట్‌ పాలసీ..!

LIC: ప్రస్తుతం ప్రతీ ఒక్కరిలో ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతోంది. దీంతో ఓవైపు డబ్బులు పొదుపు చేస్తూనే మరోవైపు హెల్త్‌, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలను తీసుకుంటున్నారు. ఇందుకోసం సంస్థలు సైతం పలు ఆకర్షణీయమైన పాలసీలను అందిస్తోంది. ఇందులో భాగంగానే ప్రముఖ భారతీయ ఇన్సూరెన్స్ సంస్థ ఎల్‌ఐసీ మంచి స్కీమ్‌ను అందిస్తోంది. ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పేరుతో తీసుకొచ్చిన ఈ ప్లాన్‌లో మంచి రిటర్న్స్ పొందే అవకాశం కల్పించారు.

రోజుకు కేవలం రూ. 45 పెట్టుబడి పెడితే చాలు రూ. 25 లక్షలు పొందొచ్చు. ఈ పథకాన్ని సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. జీవన్‌ ఆనంద్‌ పాలసీ స్కీమ్‌ టర్మ్‌ పాలసీ లాంటిది. ఇందులో కనీస బీమా రూ. 1 లక్ష వరకు ఉంటుంది. గరిష్టంగా ఎంతైనా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు రూ. 5 లక్షల ఆప్షన్‌ను ఎంచుకుంటే 35 ఏళ్ల మెచ్యూరిటీ టర్మ్‌ తీసుకుంటే చేతికి రూ. 25 లక్షలు వస్తాయి.

ఇందుకోసం ఏడాదికి రూ. 16,300 చొప్పున 35 ఏళ్లపాటు చెల్లించాల్సి ఉంటుంది. ఆ లెక్కన చూసుకుంటే రోజుకు కేవలం రూ. 45 పొదుపు చేస్తే సరిపోతుంది. మెచ్యూరిటీ సమయానికి రూ. 25 లక్షలు పొందొచ్చన్నమాట. అయితే మెచ్యూరిటీ తర్వాత కూడా పాలసీ వందేళ్ల వరకు లైఫ్‌ టైమ్‌ కవరేజీ ఉంటుంది. ఒకవేళ పాలసీ కడుతున్న సమయంలో పాలసీదారుడు మరణించినట్లయితే డెత్ క్లెయిమ్ కూడా లభిస్తుంది.

ఈ స్కీమ్‌లో ఎలాంటి పన్ను మినహాయింపు లేదు. అయితే ప్రమాదంలో మరణించినా, అంగవైకల్యం సంభవించినా, ప్రమాద ప్రయోజనం, కొత్త టర్మ్ భీమా, కొత్త క్రిటికల్ బెనిఫిట్ రైడర్ వంటివి ఉన్నాయి. డెత్‌ క్లెయిమ్‌లో భాగంగా పాలసీదారుడు నామినీకి 125 శాతం ప్రయోజనం లభిస్తుంది. పాలసీ ముగిసేలోపు మరణిస్తే.. నామినీకి కచ్చితమైన కాలానికి సమానం డబ్బు వస్తుంది. 

Tags:    

Similar News